వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమతా బెనర్జీ మేనిఫెస్టోలో వైఎస్ జగన్ స్కీమ్: ఒకటో తేదీ నాడే: తృణమూల్‌ ఓటుబ్యాంక్

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోన్న ఒకట్రెండు పథకాలు.. ఇప్పుడు పలు రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. మహిళలపై దాడులు, లైంగిక వేధింపులను అరికట్టడానికి ఉద్దేశించిన దిశ తరహా చట్టాన్ని ఇప్పటికే మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన ముసాయిదా వివరాలను ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు తెప్పించుకున్నాయి.

15 చోట్ల వరుస బాంబు పేలుళ్లు: పోలీసులు అమర్చిన సీసీటీవీలు ధ్వంసం: తీవ్ర ఉద్రిక్తత15 చోట్ల వరుస బాంబు పేలుళ్లు: పోలీసులు అమర్చిన సీసీటీవీలు ధ్వంసం: తీవ్ర ఉద్రిక్తత

వాటిని తమ రాష్ట్రాల్లో అమలు చేసే విషయంపై సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేస్తోన్నాయి. తాజాగా- ఇంటింటికీ రేషన్ డెలివరీ పథకం కూడా ఇదే స్థాయిలో గుర్తింపు పొందింది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం.. ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఈ నెల 25వ తేదీన ఇంటింటికీ ఉచిత రేషన్ బియ్యం పథకాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పుడదే పథకం.. పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో చేరింది.

TMCs manifesto including free door-to-door ration delivery scheme like Andhra govt

తాము మరోసారి అధికారంలో వస్తే.. ఇంటింటికీ ఉచితంగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బంగ్లే శోబర్-నిశ్చిత్ ఆహార్ పేరుతో తృణమూల్ కాంగ్రెస్ ఈ పథకానికి రూపకల్పన చేసింది. ఇప్పటికే అమల్లో ఉన్న ఖాద్య సాథీ పథకం కిందికి దీన్ని చేర్చింది. తెల్లరేషన్ కార్డు ఉన్న ఏ ఒక్క కుటుంబం కూడా బియ్యాన్ని తెచ్చుకోవడానికి చౌక ధరల దుకాణాల వరకూ వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొంది.

TMCs manifesto including free door-to-door ration delivery scheme like Andhra govt

ప్రతినెలా ఇంటి వద్దకే రేషన్‌ను ఉచితంగా అందిస్తామని తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో కోటిన్నరకు పైగా తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు. వారందరికీ ఈ పథకం ద్వారా లబ్ది కలుగుతుందని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తామని, ప్రతినెలా 1వ తేదీ నాడే ఇంటింటికీ ఉచితంగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా మమతా బెనర్జీ హామీ ఇచ్చారు.

English summary
Trinamool Congress (TMC) assembly election manifesto released by chief minister Mamata Banerjee on Wednesday. Its includes free doorstep delivery of ration like Andhra government headed by Chief Minister YS Jagan Mohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X