పవన్ దెబ్బకు దిగొచ్చిన టాలీవుడ్, అల్లు..దిల్ సహా - చంద్రబాబుతో భేటీ..!!
తెలుగు సినీ పరిశ్రమలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఇప్పటి వరకు పరిశ్రమ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలవక పోవటం పైన తాజాగా పవన్ సీరియస్ అయ్యారు. రిటర్న్ గిఫ్ట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ తరువాత సినీ పెద్దలు స్పందించారు. పవన్ వ్యాఖ్యలకు అల్లు, దిల్ రాజు మద్దతు ప్రకటించారు. ఇక, ఇప్పుడు టాలీవుడ్ పెద్దలు సీఎం చంద్రబాబును కలిసేందుకు నిర్ణయించారు. పవన్ సారధ్యం లోనే కలవాలని డిసైడ్ అయ్యారు.
కొద్ది రోజులు ఏపీ కేంద్రంగా సినీ పరిశ్రమకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుం టున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ప్రత్యేక సందర్భాల్లో కొందరు సినీ ప్రముఖులు పవన్ కు కలిసారు. సీఎం చంద్రబాబును మాత్రం కలవకపోవటం సంచలనంగా మారింది. అమరావతికి వచ్చిన సినీ పెద్దలు కేవలం పవన్ తో మాత్రమే సమావేశం కావటం.. ఆ తరువాత కూడా చంద్రబాబును కలవకపోవటం పైన కూటమిలోనే ఆగ్రహం వ్యక్తం అయింది. ఇక, హరిహర వీరమల్లు సినిమా విడుదల కు సిద్దం అయిన వేళ థియేటర్ల బంద్ నిర్ణయం పవన్ కు నచ్చలేదు. దీంతో, సీరియస్ అయ్యారు. ఆ తరువాత ధియేటర్ల పైన దాడులు జరిగాయి. ఇక, హరి హర వీర మల్లు ప్రస్తుతానికి వాయిదా పడింది.

పవన్ సినీ పరిశ్రమ పెద్దల పైన చేసిన వ్యాఖ్యలపై పలువురు స్పందించారు. అల్లు అరవింద్, దిల్ రాజు వంటి వారు పవన్ చేసిన సూచనలను స్వీకరిస్తామని చెప్పారు. పవన్ తనకు అన్న లాంటి వారని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఇప్పుడు సినీ పెద్దలు పవన్ సారధ్యంలోనే చంద్రబాబు ను కలవాలని నిర్ణయించారు. ఇందు కోసం ఈ నెల 15వ తేదీన ఉండవల్లిలో చంద్రబాబును కలిసేందుకు అప్పాయింట్ మెంట్ కోరారు. 15వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఈ మేరకు అప్పాయింట్ మెంట్ ఖరారైనట్లు సమాచారం. దాదాపు 30 మంది వరకు సినీ రంగ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్, దిల్ రాజు పరిశ్రమ నుంచి పెద్దలుగా తమ సమస్యలను చంద్రబాబుకు వివరించనున్నారు. అయితే, ఇంకా ఎవరెవరు ఈ సమావేశానికి వస్తారు.. ఏం చర్చిస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications