వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ లో దిల్ రాజు 'రాజకీయం'..?
ఒక సినిమా సూపర్ హిట్టైనా, ఫ్లాపైనా దర్శకుడు, హీరో, నిర్మాతలు బాగానే ఉంటారు. నిర్మాత సినిమాను అమ్మేస్తాడు.. హీరో, దర్శకుడు పారితోషికం తీసుకుంటారు కాబట్టి సినిమా ప్లాపైతే మొదటగా ఇబ్బందులు ఎదుర్కొనేది డిస్ట్రిబ్యూటరే. అది ఆచార్య, ఏజంట్, భోళాశంకర్ లాంటి డిజాస్టర్లైతే వారి పరిస్థితి తల్లకిందులవుతుంది. డిస్ట్రిబ్యూషన్ రంగంలో అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు దిట్ట. నైజాం ఏరియాకు ప్రధాన డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు అవతరించారు. ఆ ప్రాంతానికి రాజులా చెలామణి అవుతున్నాడు. ఆయన చెప్పిందే రేటు.. ఆయన విడుదల చేసిందే సినిమా అన్నట్లుగా మారిపోయింది.

డిస్ట్రిబ్యూషన్ లో ఎత్తుపల్లాలుంటాయి. ఒక్క సినిమాతో పాతాళానికి పడిపోవచ్చు.. మరో సినిమాతో ఆకాశానికి ఎగరవచ్చు. తాజాగా వైజాగ్ ప్రాంతానికి ధీటైన్ డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్న వైజాగ్ సతీష్ పాతాళంలోకి జారిపోయారు. ఏజంట్ సినిమా ఆయనకు భారీ నష్టాలను మిగిల్చింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ సినిమా హక్కులు నిర్మాత ఇవ్వలేదు. రూ.30 కోట్లు తిరిగిస్తానని చెప్పి ఇవ్వకపోవడంతో భోళాశంకర్ విడుదలకు సంబంధించి స్టే విధించినట్లుగా సతీష్ ఓ వీడియోను విడుదల చేశారు.

సతీష్ కోర్టుకు వెళ్లడంతో ఇతర నిర్మాతలంతా కలిసి అతనిమీద బ్యాన్ విధించారు. వైజాగ్ సతీష్ వల్ల వైజాగ్ ఏరియాలో దిల్ రాజు ఆటలు సాగలేదు. అయితే టైం కలిసిరావడంతో సతీష్ మీద బ్యాన్ విధించడం వెనక దిల్ రాజు హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా విశాఖ ప్రాంతానికి కొత్త డిస్ట్రిబ్యూషన్ సంస్థ రాబోతోందని, అందులో దిల్ రాజు హస్తం ఉండబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. లైగర్, ఆచార్య సినిమాలతో వరంగల్ శ్రీను పాతాళానికి పడిపోయారు. ఇప్పుడు సతీష్ కూడా ఆయనలా పడిపోతారా? లేదంటే మరో సినిమాతో పైకి లేస్తారా? అనేది కాలమే నిర్ణయించనుంది.












Click it and Unblock the Notifications