పట్టాలు దాటుతున్న బర్రెలను లాక్కెళ్లిన రైలు: 12 బర్రెలు మృతి
హైదరాబాద్: రైలు ఢీకొని 12 బర్రెలు మృతి చెందాయి. రైలు వస్తున్న సమయంలోనే బర్రెల గుంపు రైలు పట్టాల మీదుగా వెళుతుండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన నగరంలోని హఫీజ్‌పేట ప్రాంతంలో జరిగింది.
ఎంఎంటిఎస్ రైలు ఢీకొనడంతో 12 బర్రెలు మృతి చెందాయి. గోపాల్‌రావునగర్‌లోని దర్గా సమీపంలో రైలు పట్టాలు దాటుతున్న బర్రెల గుంపును రైలు ఢీకొట్టడంతో బర్రెలు మృత చెందాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

‘వేగంగా వస్తున్న రైలు బర్రెల మందను ఢీకొనడంతో 12 బర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. రైలు లాక్కెళ్లడంతో మరికొన్ని బర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి' అని చెప్పారు. రైళ్ల కింద బర్రెల మృతదేహాలు చిక్కుకోవడంతో ఎంఎంటిఎస్ రైలును నిలిపేశారు.
ఈ ప్రమాద ఘటనతో సుమారు గంటపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ‘ఘటన జరిగిన ప్రాంతంలో జంతువులు తరచూ పట్టాలను దాటుతుంటాయి. పచ్చిక మేత కోసం వచ్చే బర్రెలు రోజంతా ఇక్కడే ఉంటాయి' అని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న నాంపల్లి రైల్వే పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications