టీడీపీ శిక్షణా శిబిరంలో ఉల్లాసంగా కనిపించిన చంద్రబాబు
గుంటూరు: సాంకేతిక రంగంలో అప్‌డేట్ కాకుంటే ఔట్ డేట్ అయిపోతారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో తెలుగుదేశం రెండో రోజు జరిగిన సాధికారిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. సాంకేతికతను అందిపుచ్చుకని నాయకులు విద్యార్ధులుగా మారి పాఠాలు నేర్చుకోవడం చూస్తుంటే తనకు ఎంతో ముచ్చటేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. టెక్నాలజీ పరంగా ముందుంటే, ప్రపంచం మొత్తం మన ముందున్నట్టేనని తన పార్టీ నేతలకు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడంలో విజయం సాధించారు.












Click it and Unblock the Notifications