లడ్డూపై సీఎం చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందేనా..?

సీఎం చంద్రబాబు తిరుపతి లడ్డూ ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 అయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో అవినీతి చోటు చేసుకుందని.. లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల ఎముకలతో చేసిన ఆయిల్‌ను ఉపయోగించారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో NDDB CALF ఇచ్చిన రిపోర్టు కూడా బయటకు రావడం జరిగింది. దీంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల లడ్డూపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ సాగింది.

లడ్డూలో వాడే నెయ్యిపై జులై 8, 2024న ల్యాబ్‌కు పంపించగా.. జులై 17వ తేదీన NDDB CALF ల్యాబ్ నివేదిక ఇచ్చిందన్నారు.ఈ వివాదంపై వైసీపీ శ్రేణులు సైతం ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. NDDB CALF ఇచ్చిన రిపోర్టులపై వైసీపీ పలు అనుమనాలు వ్యక్తం చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ శాంపిల్స్‌ను సేకరించారని ఆ తేదీలను చూస్తే ఇట్టే అర్థం అవుతోంది. పైగా జులై 17వ తేదీన NDDB CALF ల్యాబ్ నివేదిక ఇస్తే..దాన్ని ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదని వైసీపీ నేతలు చంద్రబాబును ప్రశ్నించారు. అలా కాకుండా ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత ఇలాంటి ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని ఇట్టే తెలిసిపోతోందని వైసీపీ నాయకులు అభిప్రాయపడ్డారు.

trending on social media that Chandrababu should apologize to Hindus

లడ్డూ వివాదంపై వైసీపీ నాయకులు వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన దేశ ఉన్నత న్యాయస్థానం సోమవారం రాష్ట్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాజకీయాల నుంచి దేవుడిని దూరంగా ఉంచాలని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా రాజకీయాలకు, మతానికి మధ్య ఉండాల్సిన దూరాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తుచేసింది. మరోవైపు తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో చేపనూనె, జంతువుల కొవ్వు, పందికొవ్వు ఉన్నట్లు గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును సీఎం చంద్రబాబు విడుదల చేసిన సమయాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. లడ్డూ వివాదం గురించి దీనిపై చంద్రబాబు మీడియాను ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని కూడా ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. నెయ్యి శాంపిల్స్ పరీక్షలపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని కూడా ప్రశ్నించింది. లడ్డూల్ని ముందే పరీక్షలకు ఎందుకు పంపలేదని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మైసూరు లేదా ఘజియాబాద్ ల్యాబ్ ల నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదని చంద్రబాబు సర్కార్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

దీంతో లడ్డూ వివాదంలో చంద్రబాబే తొందరపడి వ్యాఖ్యలు చేసినట్టు అయిందని సుప్రీంకోర్టు తేల్చినట్టు అయింది. దీంతో సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. హిందువుల మనోభావాలతో ఆడుకున్న చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. హిందువులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే #CBNShouldApologizeToHindus అనే ట్యాగ్‌ను పెద్ద ఎత్తున ట్రెండ్‌ చేస్తున్నారు. మరి దీనిపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+