తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ ముఖ్య గమనిక

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీలో మార్పు లేదు. తాకిడి కొనసాగుతోంది. సోమవారం 70,044 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,241 మంది తలనీలాలను సమర్పించుకుంటోన్నారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 20 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోతున్నాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 8 నుంచి 10 గంటల కొద్దీ సమయం పట్టింది. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 5.08 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి.

వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ మొదటి ఘాట్ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టింది. తిరుమల నుండి తిరుపతి వెళ్ళే కనుమ దారిలో బీటీ రోడ్డు మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలను నడపాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీవారి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డును మూసివేయకుండా నిర్దేశించిన సమయంలో మరమ్మతు పనులను పూర్తి చేసేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది.

TTD Appeals for Caution Plan Ahead for Ghat Road Travel as Repair Work Aims to Complete on Time

భక్తులు తమ తిరుమల ప్రయాణాన్ని తదనుగుణంగా మార్చుకోవాలని సూచించింది. కనీసం గంట ముందుగా తమ ప్రయాణాన్ని ప్రారంభించాలని టీటీడీ కోరుతోంది. మరమ్మతుల కారణంగా వాహనదారులు నెమ్మదిగా అక్కడక్కడా కొద్ది సేపు ఆగుతూ ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపింది. అక్కడక్కడ ఆగాల్సి రావడం వల్ల ప్రయాణంలో జాప్యం ఏర్పడుతుందని, అందుకే ముందుగానే తమ ప్రయాణాన్ని ప్రారంభించాలని సూచించింది.

ఈ నేపథ్యంలో తిరుమల నుండి రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి రైల్వేస్టేషన్, ఆర్డీసీ బస్టాండ్లకు వెళ్ళే భక్తులు ముందస్తుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+