TTD: యవతకు శ్రీవారి బ్రేక్ దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం..!!
Tirumala: తిరుమలలో వసతి సముదాయాల నిర్మాణానికి టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది. కాటేజీల్లో రూ.1.82 కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పనులు, మరమ్మతులు చేపట్టేందుకు టెండరుకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలోయువతో హైందవ ధర్మవ్యాప్తి కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరాహస్వామి విశ్రాంతి గృహం నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు నాలుగు లైన్ల రోడ్డు ఏర్పాటుకు టెండర్ల ఆమోదం తెలిపారు.
యువతకు బ్రేక్ దర్శనం: యువతకు శ్రీవారి బ్రేక్ దర్శనం పైన టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. యువతలో హైందవ ధర్మవ్యాప్తి కోసం 25 ఏళ్లలోపు వారికి రామకోటి తరహాలో గోవింద కోటి పుస్తకాలను టీటీడీ అందుబాటులోకి తెలచ్చింది. 200 పేజీల పుస్తకం ధర రూ 111 గా నిర్ణయించారు. మొ్తం 26 పుస్తకాల్లో 10,01,116 సార్లు గోవింద నామాలు రాసిన వారికి స్వామి వారి బ్రేక్ దర్శనం కల్పిస్తారు.

253 గోవింద కోటి పుస్తకాల్లో కోటీ సార్లు రాసిన వారికి కుటుంబసభ్యులు అయిదుగురితో శ్రీవారి బ్రేక్ దర్శనం, వసతి కల్పించాలని నిర్ణయించారు. తెలుగు, ఇంగ్లీషు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 20 పేజీలతో ముద్రించిన 20 వేల పుస్తకాలను ఆయా రాష్ట్రాల్లో ఉచితంగా ఇవ్వనున్నారు.
వసతి సముదాయాలు: తాజాగా జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో మరిన్న ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సత్రం(రెండో సత్రం) స్థానంలో జిఎస్టీ కాకుండా రూ.209.65 కోట్లతో అచ్యుతం వసతి సముదాయం, శ్రీకోదండరామస్వామి సత్రం(మూడో సత్రం) స్థానంలో జిఎస్టీ కాకుండా రూ.209.65 కోట్లతో శ్రీపథం వసతి సముదాయం నిర్మాణానికి టెండర్లు ఆమోదం పొందాయి.
తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో పాలనా సౌలభ్యం కోసం రూ.6.15 కోట్లతో సెంట్రలైజ్డ్ రికార్డు స్టోర్ నిర్మాణానికి టెండరు ఆమోదం లభించింది. తిరుమల హెచ్‌విసి ప్రాంతంలో మిగిలి ఉన్న కాటేజీల్లో రూ.1.82 కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పనులు, మరమ్మతులు చేపట్టేందుకు టెండరు ఆమోదం పొందింది.
కీలక నిర్ణయాలు: దూరప్రాంతాల నుండి వచ్చే యాత్రికులు తమ బస్సులు, ఇతర వాహనాలను అలిపిరిలో పార్క్ చేసి తిరుమలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ రూ.7.31 కోట్లతో వంటషెడ్లు, మరుగుదొడ్ల బ్లాక్‌లు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధి, శాశ్వత క్యూలైన్ల ఏర్పాటుకు టెండరు ఖరారుకు ఆమోదం తెలిపారు. అదేవిధంగా, అలిపిరిలో రూ.7.24 కోట్లతో నూతన పార్కింగ్ ప్రాంతాల ఏర్పాటుకు టెండరు ఖరారు చేసారు.
వీటితో పాటు రూ.1.94 కోట్లతో అలిపిరి బస్టాండు, పార్కింగ్ ప్రాంతంలో బిటి రెన్యువల్ రోడ్డు ఏర్పాటుకు టెండరు ఆమోదించారు. తిరుమలలో యాత్రికుల కాటేజీల్లో నివాసమున్న పోలీసు సిబ్బందిని ఖాళీ చేయించే నిమిత్తం పాత పోలీసు క్వార్టర్ట్స్‌ను రూ.2.87 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిర్ణయించారు.












Click it and Unblock the Notifications