అలర్ట్: తిరుమలలో ఆరోజు దర్శనాలు రద్దు!

తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక. శ్రీవారి ఆలయంలో ఈనెల 23 నుంచి 2024 జనవరి 1వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార దర్శనం ఉన్న సంగతి తెలిసిందే. ఈనెల 19వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఉంటుంది. దీన్ని పురస్కరించుకొని డిసెంబరు 19న బ్రేక్ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. 18వ తేదీన వీటికి సంబంధించిన సిఫారసు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని తితిదే అధికారులు కోరారు.

ధర్మప్రచారంలో భాగంగా నాలుగు వేదాల సారాన్ని ttd ప్ర‌జ‌ల‌కు తెలియ‌బోతోంది. 2024 ఫిబ్రవరి మొదటి వారంలో సహస్రపురుష వేదస్వస్తి చతుర్వేద పారాయణం నిర్వహిస్తామని, ఇందుకోసం అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాంటూ జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌పై తిరుపతిలోని పరిపాలన భవనంలో ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ttd cancel vip break darshan on december 19th

లోక‌క్షేమం కోసం పారాయ‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌ని, ఇందుకోసం టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నం మైదానంలో ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని జేఈవో కోరారు. దేశంలోని వివిధ‌ ప్రాంతాల నుండి ప్రముఖ పండితులను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలోని స్కీమ్‌ పారాయణదారులను కూడా భాగస్వాములను చేస్తమని చెప్పారు. మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయా విభాగాల‌ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. తిరుప‌తిలోని శ్రీ కోదండ‌రామాల‌యంలో ఉద‌యం 4.00 గంటల నుంచి 5.00 గంట‌ల వ‌ర‌కు ధ‌నుర్మాస కైంక‌ర్యాలు, ఉద‌యం 5.30 నుంచి 8.00 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌కు ధ‌నుర్మాస ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+