పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి జగన్ బెదిరింపు? టీటీడీ ఛైర్మన్ షాకింగ్..!
తిరుపతిలో ముంతాజ్ హోటల్ కు భూముల కేటాయింపు వ్యవహారం మరోసారి రాజకీయంగా చిచ్చు రేపుతోంది. ముంతాజ్ హోటల్ కోసం ఓబెరాయ్ గ్రూప్ కు భూములు కేటాయింపును తప్పుబడుతూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీపై ఆరోపణలు గుప్పించగా.. ఇవాళ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రెస్ మీట్ పెట్టి వాటిని ఖండించారు. దీంతో పాటు ఆయన భూమన, వైసీపీ అధినేత జగన్ పైనా సంచలన ఆరోపణలు చేశారు.
తిరుమలపై విష ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు బీఆర్ నాయుడు తెలిపారు. 2008లో పీపీపీ క్రింద 30.32 ఎకరాల భూమి దేవలోక్ ప్రాజెక్టుకు ఇచ్చేలా ఎంఓయూ జరిగిందని, 20 ఎకరాల భూమిని ముంతాజ్ హోటల్‌కు గత ప్రభుత్వం ఇచ్చిందని ఆయన తెలిపారు. ముంతాజ్ హోటల్‌కు భూమిని ఇవ్వడంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయని, ఆ భూమిని ముంతాజ్ హోటల్‌కు ఇవ్వడానికి వీల్లేదని పాలకమండలి సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించామని గుర్తుచేశారు.

ఆ భూమి ఏడు కొండల్లోని భాగమనని, సీఎం చంద్రబాబు సూచనపై ఆ పవిత్ర స్థలాన్ని టీటీడీ వెనక్కు తీసుకోవాలని నిర్ణయించిందన్నారు. ఆ భూమికి బదులుగా మరోచోట భూమి ఇవ్వాలని నిర్ణయించామని, ముంతాజ్ హోటల్ యాజమాన్యంతో చంద్రబాబు చర్చించారన్నారు. ఇంకా పేపర్ వర్క్ జరుగుతోందని, భూమి హ్యాండోవర్ చేయలేదని బీఆర్ నాయుడు తెలిపారు. ముంతాజ్ హోటల్‌కు మీరు భూమి ఇచ్చి మాపై బురద చల్లుతారా అని వైసీపీని ప్రశ్నించారు.

అది పవిత్రమైన స్థలమని, ఒక అంగుళం కూడా పోనివ్వమని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా కొందరు మాట్లాడుతున్నారన్నారు. ముంతాజ్ హోటల్‌కు ఆ భూమిని మీరెందుకిచ్చారో ముందు సమాధానం చెప్పాలన్నారు. 13 ఏళ్లుగా సీబీఐ నుంచి తప్పించుకు తిరుగుతున్న దొంగలు మీరు అంటూ ఆరోపణలు గుప్పించారు. వైసీపీకి ఈ అంశంపై సీబీఐ విచారణ కోరే అర్హత లేదని, తప్పు చేశామని లెంపలేసుకుని ముక్కు నేలకు రాయాలన్నారు.

ఈ పాలక మండలి వచ్చినప్పటి నుంచి నీతి నిజాయితీతో పనిచేస్తోందని, తిరుమల పవిత్రత కాపాడే ఉద్దేశ్యంతోనే మేం పనిచేస్తున్నామని బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలపై ప్రతిరోజు బురదచల్లే కార్యక్రమాలు చేస్తున్నారని, అందరూ మీలా దొంగలు ఉండరన్నారు. ఆ 20 ఎకరాలు మీరు ఊరికే ఇవ్వలేదని, ఏం జరిగిందో తమకు తెలుసన్నారు. అజయ్ కుమార్‌ను స్వయంగా జగన్ పాయింట్ బ్లాంక్‌లో బెదిరించి 20 ఎకరాలు వెనక్కు తీసుకున్నారన్నారు. వైసీపీ నేత భూమన తిరుపతిలో ఉండేందుకు అర్హుడు కాదని, ఆయన్ను తిరుపతి నుంచి తరిమి కొట్టాలన్నారు.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications