టీటీడీ అధ్వర్యంలో అరుదైన వైద్య సేవలు - క్యాన్సర్ చికిత్స కోసం తాజాగా..!!

ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు టీటీడీ తిరుప‌తిని మెడిక‌ల్ హ‌బ్‌గా త‌యారు చేస్తోంద‌ని టీటీడీ ఛైర్మ‌న్ సుబ్బారెడ్డి చెప్పారు. టీటీడీ ఆధ్వ‌ర్యంలో స్విమ్స్‌, బ‌ర్డ్‌, శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల హృద‌యాల‌యం పేద‌ల‌కు విశేష వైద్య‌సేవ‌లు అందిస్తున్నాయ‌ని చెప్పారు. టాటా క్యాన్స‌ర్ ఆసుప‌త్రి, అర‌వింద కంటి ఆసుప‌త్రిని కూడా తిరుప‌తికి తీసుకురావ‌డానికి టీటీడీ త‌న వంతు స‌హ‌కారం అందించింద‌న్నారు. క్యాన్సర్ కు ఆధునిక వైద్యం దిశగా నిర్ణయం జరిగిందని చెప్పారు.

రాబోయే రోజుల్లో స్విమ్స్‌లో శ్రీ బాలాజి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాల‌జీ, శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్లల సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రుల నిర్మాణం వేగంగా జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. తిరుప‌తి న‌గ‌రం న‌డిబొడ్డున పేద‌ల‌కు అనేక వ్యాధుల‌కు సంబంధించి కార్పొరేట్ ఆసుప‌త్రుల కంటే మిన్న‌గా ఉచితంగా వైద్య‌సేవ‌లు అందిస్తున్న‌ట్టు ఛైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. క్యాన్సర్‌కు అత్యాధునిక వైద్య చికిత్సలు, వైద్య సేవలు అందించేందుకు 2023 మే 25వ తేదీ రూ.124 కోట్ల వ్యయంతో శ్రీ బాలాజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అంకాలజి ఆసుపత్రిలో కీలకమైన బంకర్‌ బ్లాక్‌ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశామ‌న్నారు. ఈ ఆసుపత్రిలో రూ.200 కోట్ల వ్యయంతో అత్యాధునిక యంత్రాలు, సదుపాయాలు ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. అదేవిధంగా రూ.97 కోట్లతో కార్డియో న్యూరో బ్లాక్ నిర్మాణానికి త‌మ‌ పాల‌క‌మండ‌లి ఆమోదం తెలిపిందన్నారు.

TTD Chairman YV Subba Reddy inaugurates the ₹1.95 crores facilities at SVIMS for the attendants of patients

స్విమ్స్ లో వందలాది మంది రోగులు వైద్య చికిత్సలు పొందుతూ ఉంటార‌ని, వార్డుల్లోని వారి సహాయకులు వసతి కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉండటాన్ని తాను స్వయంగా గుర్తించి ఓపి బ్లాక్ ఎదురుగా తాత్కాలికంగా షెడ్లు వేసి వారికి వసతి కల్పించామ‌న్నారు. ప్ర‌స్తుతం రూ.2 కోట్ల‌తో అన్ని వ‌స‌తుల‌తో ప‌క్కా భ‌వ‌నం నిర్మించామ‌ని, ఇక్క‌డ వారికి అన్నప్ర‌సాదం కూడా అందించే ఏర్పాటు చేశామ‌ని వివ‌రించారు. తల్లిదండ్రులు లేని పిల్లలను చేరదీసి వారిని బాగా చదివించి ప్రయోజకులను చేయడానికి 1943లో ఎస్వీ అనాథ శ‌ర‌ణాల‌యాన్ని టీటీడీ ప్రారంభించింద‌న్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ చదువుకున్న పిల్లలు నేడు మంచి స్థానాల్లో ఉన్నార‌ని, 1వ త‌ర‌గ‌తి నుండి డిగ్రీ వ‌ర‌కు 500 మంది విద్యార్థులు ఇక్క‌డ వ‌స‌తి పొందుతూ చదువుకుంటున్నార‌ని చెప్పారు.

TTD Chairman YV Subba Reddy inaugurates the ₹1.95 crores facilities at SVIMS for the attendants of patients

తిరుమల దేవస్థానం తిరుచానూరు(తిరుపతి) నందు పద్మావతి అమ్మవార్ల దేవస్థానానికి ఆహార వినియోగం కోసం వెండి పాత్రలను సమర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్(చిన్ని), జానకి దంపతులు అందచేసారు. విజయవాడ నుంచి ఈ సారి టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా కేశినేని చిన్ని పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. తమ ట్రస్టు తరపున ఇప్పటికే విజయవాడ పార్లమెంటరీ పరిధిలో సేవాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తిరుచానూరు దేవస్థానానికి రూ 8.30 లక్షలు విలువ చేసే ఇత్తడి పాత్రలను కుటుంబ సభ్యులతో కలిసి అందచేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+