TTD: టీటీడీలో ముదురుతున్న వివాదం..!!
Tirumala: టీటీడీలో వివాదం ముదరుతోంది. టీటీడీ ఉద్యోగి పై పాలక మండలి సభ్యుడు నరేశ్ కుమార్ దూషణలకు దిగటం తో వివాదం మొదలైంది. శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఉద్యోగి పైన బోర్డు సభ్యుడు పరుష పదజాలం ప్రయోగించారు. దీంతో, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మరో టీటీడీ సభ్యురాలు పనబాక లక్ష్మి ఒక ఉద్యోగి పైన సీరియస్ అయ్యారు. ఆ ఉద్యోగి పై చర్యలు తీసుకున్నారు. ఇలా వరుసగా బోర్డు సభ్యుల తీరు పైన ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఉన్నతాధికారులు చర్చలు చేసినా ఉద్యోగులు వెనక్కు తగ్గటం లేదు.
తిరుమల కొండ పైన కొత్త వివాదం మొదలైంది. ఉద్యోగుల పైన పాలక మండలి సభ్యల తీరు ఈ వివాదానికి కారణమవుతోంది. రెండు రోజుల క్రితం కర్ణాటకకు చెందిన నరేష్ కుమార్ అనే టీటీడీ పాలక మండలి సభ్యుడు ఆలయ మహా ద్వారం ముందు ఉన్న బాలాజీ అనే ఉద్యోగిపై దూషణల కు దిగారు. మహాద్వారం గేటు తీయకపోవటం పైన దూషించారు. భక్తులు చూస్తుండగా.. ఆలయం వద్ద ఈ తరహాలో దూషణలకు దిగటంతో ఉద్యోగులు మనస్థాపానికి గురయ్యారు.

కొన్ని నెలలుగా తాము ఈ తరహాలో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. దీంతో, టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు. రెండు రోజు సైతం తమ నిరసన కొనసా గించారు. ఉద్యోగి బాలాజీపై దురుసుగా ప్రవర్తించిన పాలక మండలి సభ్యుడు నరేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. టీటీడీ లో కొందరు సభ్యులు తాము టీటీడీకి ఓనర్లుగా భావిస్తు న్నట్లు ఉన్నారని మండిపడుతున్నారు. వారి సభ్యత్వం రద్దు చేయాలని ఉద్యోగ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల ఉద్యోగులపై అకారణంగా బదిలీవేటు వేసారని వారిని తిరిగి పునరుద్ధరించాలని కోరుతు న్నారు. త్వరలోనే అమరావతికి వెళ్లి ప్రభుత్వంలోని ముఖ్యులను కలుస్తామని వెల్లడించారు. ఈ నెల 24న మరోసారి సమావేశం కావాలని.. నరేశ్ పై చర్యలు తీసుకునే వరకూ ఆందోళన విరమిం చేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications