TTD: భక్తులకు దర్శనం, సేవల్లో కీలక మార్పులు - ఇక నుంచి..!!
Tirumala: సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం, వసతి అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడ ఈవో శ్యామలా రావు వెల్లడించార. చాట్ జీపీటీ తరహాలో వాయిస్ ఆధారిత టీటీడీ చాట్ బాట్ అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. గత ఆరు నెలల కాలంలో పలు మార్పులు తీసుకొచ్చినట్లు వవరించారు. తిరుమల క్షేత్రాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే తిరుమల విజన్-2047 లక్ష్యమని ఈవో పేర్కొన్నారు. నాణ్యమైన నెయ్యితో లడ్డూ ప్రసాదాల తయారు చేస్తున్నట్లు తెలిపారు.
దర్శనం - సేవల్లో
భక్తులకు మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నట్లు ఈవో శ్యామల రావు చెప్పారు. ఎన్‌డీడీబీ విరాళంగా ఇచ్చిన రూ.70 లక్షల పరికరాలతో టీటీడీ సొంతగా కల్తీ పరీక్షల ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుమలలో సాధారణ భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్యూలైన్ల నిర్వహణ, భక్తలు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా అదనపు ఈవో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. 45 అతిథి గృహాలకు వారి సొంత పేర్లను తొలగించి, ఆధ్యాత్మిక పేర్లు ఉండేలా చర్యలు చేపట్టామన్నారు.

కొత్త ప్రతిపాదనలు సిద్దం
స్వర్ణాంధ్ర విజన్-2047కు అనుగుణంగా తిరుమల విజన్-2047 కోసం ప్రతిపాదనలు ఆహ్వానించినట్లు తెలిపారు. తిరుమలను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయనున్నామని పేర్కొన్నారు. సుమారు 18 ప్రాజెక్టులకు ప్రణాళికల కోసం చేసేందుకు 9 సంపూర్ణ నివేదికలను తయారు చేస్తున్నట్లు చెప్పారు. తిరుమల నడక మార్గాల ఆధునీకరణ, బహుళస్థాయి పార్కింగ్, స్మార్ట్ పార్కింగ్, నూతన లింక్ రోడ్డుల నిర్మాణం, సబ్ వే ల నిర్మాణం, రామ్ భగీచ, బాలాజీ బస్టాండులను పునర్నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లించారు. భక్తులకు వసతి కోసం అలిపిరి దగ్గర 40 ఎకరాల్లో బేస్ క్యాంప్ ఏర్పాటు, ఆధ్యాత్మికత ప్రతిబింభించేలా తిరుమలలో భవనాల రూపకల్పనక నిర్ణయించారు.
హిందూయేతర ఉద్యోగులపై
టీటీడీలో ఉన్న 31 మంది హిందూయేతర ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు పంపడం, లేదా వీఆర్ఎస్ ఇవ్వాలని బోర్డు నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ, అవసరమైన పార్కింగ్, మౌలిక సదుపాయాలు, మాడ వీధుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామ్నారు. ఆకాశగంగ, పాపవినాశనం ప్రాంతాల్లో అభివృద్ధికి చర్యలు చేపడుతా మని వెల్లడించారు. సనాతన హిందూ ధర్మ ప్రచారం, పరిరక్షణలో యువతను భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తామన్నారు. టిటిడి ఆధ్వర్యంలో ఉన్న 61 ఆలయాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఈవో శ్యామలా రావు వివరించారు.












Click it and Unblock the Notifications