TTD: తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు - ఇక వీరికే పరిమితం..!!

Tirumala: టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఆ వెంటనే కోడ్ అమల్లోకి వస్తుంది. దీంతో..నేటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాల సిఫారసు లేఖల స్వీకరణ రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది. వీఐపీ బ్రేక్ దర్శనాలు కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలకు మాత్రమే వర్తించేలా నిర్ణయించారు. వేసవిలో రద్దీ పెరిగే ఛాన్స్ ఉండటంతో..అందుకు అనుగు ణంగా టీటీడీ చర్యలు ప్రారంభించింది.

సిఫార్సు లేఖలు రద్దు : దేశ వ్యాప్తంగా పార్లమెంట్, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటి వరకు ప్రముఖుల సిఫార్సు లేఖలతో పలువురు వీఐపీ బ్రేక్ దర్శనం పొందుతున్నారు. ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో వెంటనే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఈ సమయంలో టీటీడీ కోడ్ అమల్లో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శన సిఫారసు లేఖలను స్వీకరించకూడదని నిర్ణయం తీసుకుంది. నేరుగా వచ్చే ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలకు మాత్రం దర్శనం కల్పిస్తారు. దీని ద్వారా బ్రేక్ దర్శనం సమయం తగ్గిపోనుంది. సాధారణ భక్తులకు ఎక్కువ సమయం దొరుకుతుందని టీటీడ అధికారులు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడి.. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది.

TTD key decision over over VIP Break Darshan letters amid Election Code in force

సేవా టికెట్లు విడుదల : తిరుమ‌ల‌ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌ స్వామివారి ఆలయంలో శుక్రవారం ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపారు. ఆక్టోపస్ దళాలు రాష్ట్రంలోని వివిధ ప్రముఖ స్థలాలు, ఆలయాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఏటా మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతోంది. ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా మ‌రియు భ‌ద్ర‌తా, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు. ఈ నెల 18వ తేదీ ఉద‌యం 10 నుండి 20వ తేదీ ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల‌ ల‌క్కీడిప్ కోసం న‌మోదు చేసుకోవ‌చ్చు. మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

TTD key decision over over VIP Break Darshan letters amid Election Code in force

దర్శనం, వసతి కోటా : మార్చి 21వ తేదీ ఉద‌యం 10 గంట‌లకు శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుద‌ల చేస్తారు. జూన్ 19 నుండి 21వ తేదీ వరకు జరుగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు మార్చి 21న ఉదయం 10 గంటలకు భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతారు.మార్చి 21న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్రీ‌వారి వ‌ర్చువ‌ల్ సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్లు, ద‌ర్శ‌న టికెట్ల‌ కోటాను విడుద‌ల చేస్తారు. మార్చి 23న‌ ఉద‌యం 10 గంట‌లకు అంగ‌ప్ర‌ద‌క్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. మార్చి 23న ఉద‌యం 11 గంట‌లకు శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల ద‌ర్శ‌నం, గ‌దుల కోటాను విడుద‌ల చేస్తారు. మార్చి 23న మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వృద్ధులు, దివ్యాంగుల ద‌ర్శ‌న‌టికెట్ల కోటాను విడుద‌ల చేస్తారు. మార్చి 25న ఉద‌యం 10 గంట‌లకు రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న ట‌కెట్ల‌ను భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతారు. మార్చి 25న మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు తిరుమ‌ల‌, తిరుప‌తిలోని గ‌దుల కోటాను విడుద‌ల చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+