TTD: వైకుంఠ ఏకాదశి వేళ శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచనలు...!!
Tirumala: వైకుంఠ ఏకాదశికి తిరుమలలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు కీలక సూచనలు చేసింది. ఇప్పటికే ఈ పది రోజులు సాధారణ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆన్ లైన్ లో టికెట్లు జారీ చేసారు. అదే విధంగా బ్రేక్ దర్శనాలు.. ఇతర సేవల పైన నిర్ణయం తీసుకున్నారు. ఇక.. తిరుమల లో ఈ సమయంలో దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ పలు సూచనలు చేసింది
ఏర్పాట్ల పరిశీలన
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లను ఏఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. వైకుంఠ ద్వారా దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ అధికారులు, విజిలెన్స్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. జనవరి 10, 11, 12వ తేదీలలో అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కావున ఇందుకోసం అధికారులతో చర్చించి పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. దర్శనానికి విచ్చేసే విఐపిలకు వారికి అందించే పాసులలోనే దర్శన సమయం, పార్కింగ్ ప్రాంతం, ప్రవేశ, నిష్క్రమణ గేట్ల వివరాలు పొందిపరిచనున్నట్లు తెలిపారు.

భక్తులకు సూచనలు
రాంబగిచా ప్రాంతంలో వాహన పార్కింగ్ ను ఈ రోజులలో బైటకు బదిలాయించినట్లు చెప్పారు. దీనికి బదులుగా 10 బగ్గీలు, అదనపు సిబ్బంది, సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. విఐపిలు, భక్తులు తమకు కేటాయించిన సమయం ప్రకారం మాత్రమే దర్శనానికి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా భక్తులు తమ పాదరక్షలను గదులలో, వారి వాహనాలలో వదలి రావాలని సూచించారు. భక్తులకు భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
టీటీడీ నిర్ణయాలు
వైకుంఠ ద్వార దర్శనం వేళ దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు పది రోజుల పాటు రద్దు చేసారు. భక్తులకు కేటాయించిన టైంస్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని సూచన చసారు. మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్ లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించబడరు. 11 నుండి 19వ తేది వరకు వీరిని దర్శనాలకు అనుమతిం చాలని టీటీడీ నిర్ణయించింది.












Click it and Unblock the Notifications