అలిపిరిలోనే బేస్ క్యాంపు సిద్దం, అక్కడే వసతి..టికెట్ కౌంటర్లు - తెర పైకి రోప్ వే..!!
Tirumala: తిరుమలలో భక్తులకు వసతి.. సౌకర్యాల పెంపు పైన టీటీడీ కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. విజనం -2047 అమలు దిశగా కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుల వసతికి అలిపిరి వద్ద 40 ఎకరాల్లో బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేయాలని తితిదే భావిస్తోంది. అలిపిరి శిల్ప కళాశాల పరిధిలో భక్తుల వసతికి బేస్ క్యాంప్ గా ఖరారు చేసే ప్రతిపాదన పైన నిర్ణయం తీసుకోనున్నారు. బేస్ క్యాంపులో భక్తులకు వసతి.. టికెట్ కౌంటర్లు ఉండనున్నాయి. కాగా, మరో తెర పైకి రోప్ వే అంశం చర్చకు వచ్చింది.
తిరుమలకు వచ్చే భక్తుల కోసం అలిపిరి వద్ద 40 ఎకరాల్లో బేస్ క్యాంపు ఏర్పాటు దిశగా టీటీడీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. నిత్యం పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్న భక్తుల కోసం వసతి.. సౌకర్యాల కల్పన టీటీడీకి కష్టంగా మారుతోంది. తిరుమలలో 7,790 టీటీడీ గదులు, 1,105 మఠాల గదులు, 6,800 లాకర్లు ఉన్నాయి. వీటి ద్వారా కేవలం 55 వేల మందికి మాత్రమే వసతి కల్పించే అవకాశం ఉంటోంది. మిగిలిన భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఈ సవాళ్లను ఎదుర్కోవడం కోసమే టీటీడీ బేస్‌క్యాంప్ ప్రాజెక్ట్‌పై ప్రధాన దృష్టిసారించింది. అలిపిరి లోని శిల్ప కళాశాల పరిధిలో బేస్ క్యాంపును ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారు. అక్కడే టికెట్ కౌంటర్ల ఏర్పాటు పైనా కసరత్తు చేస్తున్నారు.

బేస్ క్యాంపులో వసతి కల్పించటం ద్వారా తిరుమలలో గదుల కేటాయింపు పైన ఒత్తిడి తగ్గనుంది. అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి చేరే ప్రైవేట్ వాహనాలను ఈ బేస్‌క్యాంప్‌కు మళ్లించి వాటిలో వచ్చిన భక్తులను టీటీడీ, ఏపీఎస్‌ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా తిరుమలకు పంపేందుకు ప్రత్యేక కేంద్రం.. మోడల్ ట్రాన్స్‌ఫర్ టెర్మినల్ ఏర్పాటు చేస్తారు. భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు, స్నానాలు చేసేందుకు, భోజనం హాళ్లు, లాకర్లు వంటి సదుపాయాలు కల్పి స్తారు. ఈ బేస్‌క్యాంప్ అందుబాటులోకి వస్తే కొండపై వాహన కాలుష్యం తగ్గించడంతో పాటు నీటి, విద్యుత్ వినియోగాన్ని సమర్థంగా నియంత్రించవచ్చని టీటీడీ భావిస్తోంది. ట్రాఫిక్ సమస్య కూడా తగ్గిపోయి తిరుమలలో కేవలం గోవింద నామస్మరణ మాత్రమే వినిపిస్తుందని టీటీడీ భావిస్తోంది. దీనికి అనుగుణంగా నిర్ణయాలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది.
బేస్ క్యాంపు ఏర్పాటు చేయాలని భావిస్తున్న శిల్ప కళాశాలను మరో ప్రాంతానికి తరలించాలని ప్రతిపాదనలు చేస్తున్నారు. టీటీడీకి చెందిన భూమి కావటంతో ఎలాంటి సమస్యలు ఉండవని భావిస్తున్నారు. దీని ద్వారా అలిపిరి నుంచి కాలినడకన వచ్చే వారికి ప్రయోజనం కలగనుంది. ఇక.. ఈ అంశం పైన ఈ రోజు జరిగే టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా.. కాటేజీ దాతల ప్రయోజనాలు, నిర్వహణ వంటి అంశాలు, శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆలయాల నిర్మాణాలకు సమగ్ర విధి విధానాల రూపకల్పన, నిధుల మంజూరు వంటి అంశాల పై తీర్మానాలు చేయనున్నారు. వంద ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్ట్ కు బోర్డు ఆమోదం తెలపనుంది. పదేళ్ల క్రితం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైన తిరుమలకు రోప్ వే అంశం పైనా చర్చించనున్నట్టు సమాచారం. దీంతో.. ఈ రోజు జరిగే బోర్డు సమావేశంలో తీసుకునే నిర్ణయాల పై ఆసక్తి నెలకొంది.
-
అలిపిరితో పాటు తిరుమలలో -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications