TTD: సామాన్య భక్తులకు శ్రీవారి అరుదైన దర్శనం-15 ఏళ్ల తరువాత, కొత్త రికార్డు..!!

Tirumala: తిరుమలలో సాధారణ భక్తులకు గోల్డెన్ ఛాన్స్ దక్కింది. రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో సామాన్య భక్తులకు ఊహించని విధంగా శ్రీవారి అరుదైన దర్శనం లభించింది. వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. వారాంతం కావటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలి వచ్చారు. దాదాపు 15 ఏళ్ల క్రితం ఆగిపోయిన ఈ విధానం తిరిగి అవకాశం కల్పించటంతో భక్తులకు ఈ అవకాశం దక్కింది.

తిరుమలలో సాధారణ భక్తులకు శ్రీవారి అభిషేక దర్శనం దొరికింది. కేవలం అడ్వాన్స్‌, సిఫారసుపై టికెట్లు పొందిన భక్తులను మాత్రమే ఈసేవకు అనుమతిస్తారు. కాగా, తాజాగా అభిషేక సేవ జరుగుతున్న సమయంలోనూ సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించారు. దీంతో సేవ జరిగిన 4.30 నుంచి 6 గంటల మధ్య దాదాపు 3వేల మందికిపైగా సర్వదర్శన భక్తులకు అభిషేక సేవలో స్వామిని దర్శించుకునే అదృష్టం లభించింది. దాదాపు పదిహేనేళ్ల క్రితం ఆగిపోయిన ఈ విధానాన్ని తిరిగి అమలుచేశారు. కాగా.. తిరుమలలో ఎలాంటి టోకెన్లు లేకుండా తిరుమలకు వచ్చిన వారికి శుక్రవారం తెల్లవారుజాము నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు మొదలయ్యాయి. భారీగా వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడింది. రద్దీ అధికమవుతున్న క్రమంలో గురువారం రాత్రి 11.30 నుంచే దర్శనాలకు భక్తులను అనుమతించారు.

ttd-provided-abhisheka-darshanam-for-common-deovtees-after-15-years

ఇక, ఏకాంతసేవ ప్రారంభమయ్యే వరకు దాదాపు 4వేల మందికి సర్వదర్శనాలు చేయించారు. తిరిగి శుక్రవారం వేకువజామున తిరుప్పావై, కైంకర్యాలు పూర్తయిన తర్వాత 2గంటల నుంచి సర్వదర్శనాలు కొనసాగాయి. ప్రస్తుతం బాటగంగమ్మ ఆలయం సర్కిల్‌ వద్ద నుంచి సర్వదర్శన భక్తులను అనుమతిస్తున్నారు. వీరు రింగురోడ్డులో దాదాపు రెండున్నర కిలోమీటర్లు దూరం ఉండే క్యూలైన్‌లో వెళ్లి నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2 కంపార్టుమెంట్ల ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయానికి 45,900 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనం క్యూలైన్‌ ద్వారా వెళ్లినవారికి దాదాపు 16 గంటల దర్శన సమయం పడుతోంది. డిసెంబరు 30, 31, జనవరి 1 తేదీల్లో 2.02 లక్షల మందికి వైకుంఠ ర దర్శనం లభించింది. గత వైకుంఠద్వార దర్శనాల్లో తొలి మూడురోజులతో పోలిస్తే 18,461 మంది భక్తులు అదనంగా ఉత్తర ద్వార ప్రవేశం చేశారు. శుక్రవారం 83,032 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+