TTD: ఇక అలిపిరిలోనే భక్తులకు వసతి - ఎస్వీబీసీకి కొత్త ఛైర్మన్..!!
Tirumala: టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన సమీక్షలో పలు ప్రతిపాదనల పైన చర్చించారు. తిరుమలలో రానున్న 50 ఏళ్ల కాలానికి వీలుగా మార్పులు జరగాలని నిర్దేశించారు. శ్రీవారి భక్తులకు వాట్సప్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. అదే సమయంలో దర్శనం.. వసతి విషయంలో తీసుకోవాల్సిన చర్యల పైన పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అందులో భాగంగా అలిపిరి వద్ద వసతి సౌకర్యం కల్పించాలని డిసైడ్ అయ్యారు. దీంతో పాటుగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.
అలిపిరిలో బేస్ క్యాంప్
తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవారి పాదాల చెంత ఉన్న అలిపిరిలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. అలిపిరిలో గతంలో దేవలోక్, ఎంఆర్‌కేఆర్, ఒబెరా య్ హోటల్ సంస్థలకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అక్కడ రద్దు చేసిన 35 ఎకరాలను బేస్ క్యాంప్ నిర్మాణానికి వినియోగించాలని యోచిస్తు న్నారు. సుమారు 25,000ల మందికి ఇక్కడ వసతి కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా ఆధ్యాత్మిక వాతావరణం, పవిత్రత ఉండేలా ఏర్పాట్లు చేయ నున్నారు. ప్రస్తుతం కొండపై 55,000ల మంది యాత్రికులను సర్దుబాటు చేయవచ్చు. అంతకు మించి భక్తులు వస్తున్నందున బేస్ క్యాంప్ ఎంతో ఉపయోగపడనుంది.

50 ఏళ్ల అవసరాలకు
అలిపిరి వద్ద బేస్ క్యాంప్ ఇది అందుబాటులోకి వస్తే తిరుమలలో పార్కింగ్ సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎవరైనా భక్తులు వాహనాల్లో బేస్ క్యాంప్‌నకు వస్తే ఇక్కడే వాహనాన్ని పార్క్ చేసుకుని విద్యుత్ బస్సుల్లో కొండపైకి వెళ్లొచ్చు. గతంలో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) మాస్టర్‌ప్లాన్‌లో ఈ అంశాన్ని పొందుపరిచింది. దీన్ని ప్రస్తుతం ఆచరణలోకి తీసుకురానున్నారు. మరోవైపు తిరుమల దార్శనికపత్రం (విజన్ డాక్యుమెంట్)- 2047 రూపకల్పనకు 18 అంశాలను ప్రాతిపదికగా తీసుకోనున్నారు. తిరుమలలో ఫుట్‌పాత్‌లు కొన్నిచోట్ల అస్తవ్యస్తంగా ఉన్నాయి. వీటిని కూడా ఓ ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయనున్నారు. రాంభగీచా, బాలాజీ బస్టాండ్లను పునర్‌నిర్మాణం చేయాలని భావిస్తున్నారు.
వాట్సప్ సేవలు
విషయాన్ని, రాష్ట్రం వెలుపల ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయాల పురోగతిని వివరించారు. తిరుచా నూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రోజుకు 25 వేల మంది వరకూ భక్తులు వస్తారని అధికారులు తెలపగా..దీనికి మరింత అభివృద్ది చేయాలని సీఎం సూచించారు. బర్డ్ ఆసుపత్రికి డైరెక్టర్ నియామకం, జేఈవో, సివిఎస్‌వో, ఎస్వీబీసీ చైర్మన్ నియామకాలను త్వరలో చేపడతామని సీఎం చెప్పారు. టీటీడీ నుంచి 15 రకాల సేవలు వాట్సాప్‌లో అందిస్తామని అధికారులు చెప్పగా...వెంటనే వాట్సాప్ సేవలు ప్రారంభం కావాలని సీఎం సూచించారు. ప్రతి సేవకు ఆధార్, సెల్ ఫోన్ నెంబర్‌ను లింక్ చేయడం ద్వారా ఎక్కడా అక్రమాలు జరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుందని సీఎం చెప్పారు.












Click it and Unblock the Notifications