TTD: నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో విశేషఉత్సవం; తిరుపతిలోనూ పుష్పయాగం!!
కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడు కొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు జరుగుతాయి అన్నది తెలిసిన విషయమే. శ్రీవారి ఆలయంలో మే నెలలోనూ విశేష ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర నిర్వహించనున్నారు. ఈ ఉత్సవం సందర్భంగా మే 3 నుండి 21వ తేదీ వరకు 19 రోజులపాటు ఉభయం సమర్పణ జరుగుతోంది.
భాష్యకార్ల సాత్తుమొర.. తిరుమాడ వీధులలో మలయప్ప స్వామి
శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు. శ్రీ భాష్యకార్ల సాత్తుమొర సందర్భంగా తిరుమలలో స్వామివారికి విశేష పూజలు చేస్తారు. ఈరోజు సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఒక తిరుచ్చిపై తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు.

స్వామివారికి ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు
శ్రీభాష్యకార్లవారిని కూడా మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. రాత్రి 7.30 నుంచి 9.30 గంటల వరకు భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు. స్వామివారికి ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపడతారు. ఇక ఈ కార్యక్రమంలో జీయర్‌స్వాములు, ఏకాంగులు తదితరులు పాల్గొంటారు.
తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో పుష్పయాగం
ఈరోజు టిటిడి ఆధ్వర్యంలో మరో విశేషఉత్సవం కూడా జరగబోతుంది. తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో వార్షిక పుష్పయాగం నిర్వహించనున్నారు. నిన్న సాయంత్రం పుష్పయాగానికి అంకురార్పణ జరగగా, ఈరోజు ఉదయం 10గంటల నుండి 11గంటల వరకు స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.అనంతరం సాయంత్రం 4గంటల నుంచి 6గంటల వరకు సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారికి పలు రకాల పుష్పాలతో అభిషేకం నిర్వహిస్తారు.
పుష్పయాగాన్ని నిర్వహిస్తే సమస్త దోష నివారణ
అనంతరం ఏడు గంటలకు ఆలయ నాలుగు మాడ వీధులలో కోదండ రామస్వామిని ఊరేగిస్తారు. ఏప్రిల్ ఐదవ తేదీ నుండి ఏప్రిల్ 13వ తేదీ వరకు నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలలో, నిత్య కైంకర్యాలలో తెలిసి తెలియక ఏమైనా లోపాలు జరిగి ఉంటే, వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. ఈ పుష్పయాగాన్ని నిర్వహిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.
-
రాములవారి సేవలో శ్రీవారి సేవకులు, అరుదైన ఘట్టం - కన్నుల పండువగా..!! -
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
వీళ్లా ఆలయ అధికారులు.. శ్రీరామనవమి నాడే "అశ్లీల నృత్యాల" బాగోతం !! -
1,01,001 బియ్యపు గింజలపై "రామ" నామం..! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!












Click it and Unblock the Notifications