చంద్రబాబు "త్యాగం" వెనుక, ఢిల్లీ మార్క్ రాజకీయం - వైసీపీకి వరంగా..!!
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు. టీడీపీ శ్రేణులకే అంతుచిక్కని దీని వెనుక రాజకీయం చాలా ఉంది. చంద్రబాబు అసలు లక్ష్యం ఏపీలో అధికారం. అందుకుజనసేనతో పాటుగా బీజేపీ సహకారం అవసరమని నమ్ముతున్నారు. దీంతో, తాజా నిర్ణయంతో పైకి కాంగ్రెస్ కు మేలు జరుగుతున్నా..ఇదంతా ఢిల్లీ ఆపరేషన్ అనే ప్రచారం ఉంది. ఈ నిర్ణయం ప్రభావం ఏపీ మీక ఉంటుందనే చర్చ మొదలైంది. అదే ఇప్పుడు వైసీపీకి ఇప్పుడు వరంగా మారుతోంది.
పోటీకి దూరంగా టీడీపీ : తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకూడదని నిర్ణయించింది. చంద్రబాబు జైలులో ఉన్న కారణంగానే పార్టీ ఎన్నికల సంసిద్దంగా లేదని..అందుకే దూరంగా ఉండాలని నిర్ణయించిందని పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ, ఈ నిర్ణయం వెనుక భారీ కసరత్తు ఉన్నట్లు పార్టీ నేతల సమాచారం. ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణ కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన సమయంలోనే ఈ నిర్ణయం జరిగిందని తెలుస్తోంది.

ఆ సమయంలో నడ్డాతో సమావేశం..బీజేపీ-టీడీపీ దగ్గరవుతాన్నారనే సంకేతాలు ఇచ్చేందుకు ఆ సమయంలో ప్రయత్నాలు జరిగాయి. ఇక..చంద్రబాబు అరెస్ట్ తరువాత లోకేశ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం సమయంలో అక్కడే కిషన్ రెడ్డి ఉండటం..ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉంటూ టీడీపీతో కలిసినా...తెలంగాణలో పవన్ తో బీజేపీ పొత్తు ఖరారు ఇవన్నీ ఢిల్లీ మార్క్ రాజకీయ లెక్కల్లో భాగమే. ఏపీలో సహకారం ఇస్తారనే నమ్మకంతో తెలంగాణలో చంద్రబాబు పోటీ నుంచి విరమణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు నిర్ణయం వెనుక : తెలంగాణలో నేరుగా చంద్రబాబుతో కలిస్తే బీజేపీకి నష్టం. బీఆర్ఎస్ అనుకూలంగా మలచుకొనే అవకాశం. చంద్రబాబు అరెస్ట్ తరువాత లెక్కలు మారాయి. చంద్రబాబు, టీడీపీ మద్దతు దారులు రేవంత్ వైపు చూస్తున్నారు. ఓపెన్ గానే తమ మద్దతు ప్రకటించారు. ఈ సమయంలో నే బీజేపీ పావులు కదిపింది. టీడీపీ పోటీలో లేకుండా..తాము జనసేనతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది.
ఏపీలో చంద్రబాబు అరెస్ట్ సమయంలో పవన్ మద్దతుగా నిలిచిన తీరు..టీడీపీ -జనసేన మద్దతు తో సహజంగా తెలంగాణలోని టీడీపీ మద్దతు దారులు జనసేన అభ్యర్దులకే ఓట్లు వేస్తారని అంచనాకు వచ్చింది. అదే సమయంలో పవన్ ఫ్యాన్స్..కాపు, మున్నూరు కాపు ఓటర్లను ఆకర్షంచవచ్చని లెక్కలు కట్టింది. టీడీపీ మద్దతు..గతంలో ఎక్కువ ఓట్లు వచ్చిన నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్దులను నిలబెట్టాలని నిర్ణయించింది. ఫలితంగా టీడీపీ మొత్తంగా ఎన్నికల బరి నుంచే తప్పుకోవాల్సి వచ్చింది.

వైసీపీకి కలిసొచ్చేనా : అయితే, ఈ వ్యూహం బీజేపీ -జనసేనకు కలిసి వస్తుందా అనేది సందేహమే. టీడీపీ మద్దతు దారులు ఇప్పుడు తెలంగాణలో పవన్ కంటే రేవంత్ వైపే మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే లెక్క మరో విధంగా ఉంటుంది. అదే సమయంలో టీడీపీ కోరుకున్నట్లుగా బీజేపీ ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి వస్తే అది వైసీపీకి మేలు చేస్తుందనే విశ్లేషణలు ఉణ్నాయి. ఇదే సమయంలో పవన్ పైన ఏపీ ప్రజల్లో సందేహాలు మొదలవుతాయి.
చంద్రబాబు అరెస్ట్ తరువాత బీజేపీ పైన టీడీపీ మద్దతు దారులు ఆగ్రహంగా ఉన్నారు. అటు తెలంగాణలో బీజేపీతో, ఇటు ఏపీలో టీడీపీతో అంశం పవన్ విశ్వసనీయతకు సవాల్ గా మారుతోంది. ఈ మూడు పార్టీల రాజకీయం ఏపీలో వైసీపీ తమకు అనుకూలంగా మలచుకొనే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నిర్ణయం ఏపీలో ఎన్నికల సమీకరణాలపైన ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications