మహబూబ్‌నగర్ జిల్లాలో బయటపడిన సొరంగం

కొందరు ఆదివారం ఉదయం మట్టి పెళ్లలు తీసి చూడగా సొరంగ మార్గం కనిపించింది. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో లోపలికి వెళ్లి చూసేందుకు జనం జంకుతున్నారు. బొంరాస్‌పేట మండల కేంద్రంలో గ్రామం నలుదిక్కులా కోట బురుజులు ఉండేవి. కొందరు వాటిని కొన్నేళ్ల క్రితమే తొలగించారు.
కోట బురుజుపై నుంచి చూస్తే బొంరాస్‌పేట గ్రామంతో పాటు పెద్ద చెరువు కింద ఉన్న ఆయకట్టు, చుట్టుపక్కల గ్రామాలు కూడా కనిపించేవి. ప్రస్తుతం బయటపడ్డ సొరంగం గతంలో గ్రామ నలుదిక్కుల ఉన్న కోట బురుజులకు మార్గమై ఉండవచ్చనే అభిప్రాయాన్ని గ్రామస్థులు వ్యక్తం చేస్తున్నారు.
పురావస్తుశాఖ అధికారులు వచ్చి పరిశీలిస్తే సొరంగం ఎన్నేళ్ల క్రితం నిర్మించారు, ఎక్కడి వరకు నిర్మించారో తేలే అవకాశం ఉందని అంటున్నారు. మండల కేంద్రంలో సొరంగ మార్గం బయట పడిందన్న విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో దానిని చూసేందుకు పలు గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు.












Click it and Unblock the Notifications