కెసిఆర్‌ను కలిసిన టర్కీ రాణి, నిజాం సతీమణి(ఫొటోలు)
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును టర్కీ రాణి కలుసుకున్నారు. శుక్రవారం ఆమె క్యాంపు కార్యాలయానికి వచ్చి సిఎం కెసిఆర్‌తో సమావేశయ్యారు. ఇది ఇలా ఉండగా సచివాలయంలో సిఎం కెసిఆర్‌ను 8వ నిజాం ముఖరంజా సతీమణి అస్రా కలిశారు. అస్రాను సిఎం కెసిఆర్ సాదరంగా ఆహ్వానించారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయని అస్రా తెలిపారు. ప్రజలు కోరుకున్న పాలన జరుగుతోందని ఆమె అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడం, చారిత్రక వారసత్వ వైభవాలను పునరుద్ధరించడమే ధ్యేయంగా పాలన సాగించడం ఆనందంగా ఉందని అస్రా చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణానికి కృషి చేస్తున్న కెసిఆర్‌కు ఆమె అభినందనలు తెలిపారు.
గవర్నరుతో భేటీ అయిన కెసిఆర్
గవర్నర్ నర్సింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శుక్రవారం సమావేశమయ్యారు. దాదాపు ఈ సమావేశం మూడు గంటలపాటు సాగింది. విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలో ఉన్న సంస్థల పంపకాలపై వారు ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.

కెసిఆర్
సచివాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును 8వ నిజాం ముఖరంజా సతీమణి అస్రా కలిశారు.

కెసిఆర్
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయని అస్రా తెలిపారు.

కెసిఆర్
ప్రజలు కోరుకున్న పాలన జరుగుతోందని ఆమె అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడం, చారిత్రక వారసత్వ వైభవాలను పునరుద్ధరించడమే ధ్యేయంగా పాలన సాగించడం ఆనందంగా ఉందని అస్రా చెప్పారు.

కెసిఆర్
తెలంగాణ పునర్నిర్మాణానికి కృషి చేస్తున్న కెసిఆర్‌కు ఆమె అభినందనలు తెలిపారు. అస్రాను సిఎం కెసిఆర్ సాదరంగా ఆహ్వానించారు.

కెసిఆర్
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పాపారావు, పార్లమెంటు సభ్యురాలు కవిత పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications