ఏపీలో ఇద్దరు ఐఏఎస్ లకు జైలుశిక్ష-హైకోర్టు సంచలన ఆదేశాలు..

ఏపీలో మరోసారి ఐఏఎస్ అధికారులకు కోర్టు ధిక్కార కేసులో జైలుశిక్ష పడింది. ఇప్పటికే హైకోర్టు పలు కోర్టు ధిక్కార కేసుల్లో ఐఏఎస్ లకు జైలుశిక్షలు విధించడం, ఆ తర్వాత వారు క్షమాపణ చెప్పడంతో దాన్ని రద్దు చేయడం చూశాం. ఇప్పుడు మరోసారి ఇద్దరు ఐఏఎస్ అధికారులకు కోర్టు ధిక్కార కేసులో నెల రోజుల జైలుశిక్ష విధిస్తూ హైకోర్టు మరోసారి సంచలన ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఐఏఎస్ ల జైలుశిక్ష వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.

ఆంధ్ర ప్రదేశ్ లో ఇద్దరు ఐఏఎస్ అధికారులను హైకోర్టు నెల రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ ఇవాళ తీర్పు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ లు శ్యామలరావు, పోలా భాస్కర్ లకు న్యాయస్థానం నెల రోజుల జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయలు జరిమనా కూడా విధించడం గమనార్హం. ఇక శిక్ష పడిన వీరిద్దరూ డిసెంబర్ 8 లోగా రిజిస్ట్రార్ వద్ద లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలపై సదరు ఐఏఎస్ అధికారులు హైకోర్టును సమీక్ష కోరే అవకాశం ఉంది.

two ias officers imprisoned for one month by ap high court in contempt case

2019కు ముందు ఏపీలో జరిగిన నీరు-చెట్టు పనుల బిల్లుల చెల్లింపుకు హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయినా ఆ బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదు. దీంతో కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో తమ ఆదేశాలు పాటించని అధికారులపై కోర్టు ధిక్కార చర్యలకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు నీరు-చెట్టు బిల్లుల చెల్లింపు చేయని అధికారులపై చర్యలకు ఆదేశించింది. గతంలోనూ హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాల్ని అమలు చేయని ఐఏఎస్ లకు జైలుశిక్షలు పడ్డాయి. అయితే వాటిని ఆ తర్వాత హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఈ వ్యవహారంలో ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+