పవన్‌కల్యాణ్ గెలవగానే ఫోన్ స్విచ్చాఫ్ చేసిన ఇద్దరు స్టార్ హీరోలు
జనసేన అధినేత కొణిదెల పవన్‌కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి 74వేల పైచిలుకు మెజారిటీతో ఘనవిజయాన్ని సాధించారు. అంతేకాదు తనతోపాటు పోటీచేసిన మరో 20 మందిని వారివారి నియోజకవర్గాల నుంచి అద్భుతమైన మెజారిటీతో గెలిపించగలిగారు. ఎన్నికల చరిత్రలో వందకు వంద శాతం స్ట్రైక్ రేటు నమోదు చేసిన జనసేన సంచలన రికార్డును నమోదు చేసింది. పవన్ విజయం సాధించగానే తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, అన్ని విభాగాలకు చెందిన ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలియజేశారు.
జగన్‌తో లావాదేవీలు
అయితే ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం వెంటనే తమ ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీతో ఈ ఇద్దరు హీరోలు రాసుకొని పూసుకొని తిరిగారు. వ్యాపారాల పరంగా లావాదేవీలు నిర్వహించి భారీ లాభాలను మూటకట్టుకున్నారు. ఈ ఇద్దరు హీరోలు జగన్‌కు ఒకరు రైట్ హ్యాండ్, మరొకరు లెఫ్ట్ హ్యాండ్ అన్నట్లుగా ఉండేవారని సమాచారం. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీచేస్తున్నారనే సమాచారం బయటకు రాగానే వైసీపీ నాయకులు దూషణ పర్వం కొనసాగించారు.

ప్రతి రూపాయికి బాధ్యతతో ఉంటా
ఆ సమయంలో కూడా ఈ ఇద్దరు హీరోలు పవన్ కు మద్దతు తెలియజేయలేదు. పవన్ గెలిచినట్లు వార్త రాగానే ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారంటున్నారు. ఎవరితోను వీరు కాంటాక్ట్ లో లేరంట. తమపని తాము సైలెంట్ గా చేసుకుపోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం తెలుగు సినీ పరిశ్రమలో వైరలవుతోంది. అధికారం చేపట్టిన పవన్ కల్యాణ్ తమ రాజ్యం ఎలా ఉండబోతుందో ప్రజలకు కొద్దిరోజుల్లోనే తెలియజేయబోతున్నారు. తాను తప్పు చేశాను అనే విషయం నిరూపితమైతే కాలరు పట్టుకొని నిలదీయాలని ప్రజలకు సూచించారు. ఎమ్మెల్యేగా తాను పూర్తి జీతం తీసుకుంటానన్నారు. తీసుకున్న ప్రతి రూపాయికి జవాబుదారీతనంగా ఉంటానన్నారు.












Click it and Unblock the Notifications