దోపిడీ దొంగల అరెస్ట్: 4.50 లక్షల గోల్డ్ సీజ్(పిక్చర్స్)
విశాఖపట్నం: వివిధ జిల్లాల్లో పలు దొంగతనం కేసుల్లో నిందితులుగా శిక్ష అనుభవించిన ఇద్దరు యువకులను సిసిఎస్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ. 4.50 లక్షల విలువయిన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రైం డిసిపి జె. మురళీధర్ వివరాలు వెల్లడించారు.
పిఎంపాలెంకు చెందిన దంగేటి రాజీవ్ గాంధీ, చెంగల్రావుపేటకు చెందిన వాసుపల్లి నరేంద్ర కలిసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని, కంచరపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఇళ్లల్లో చొరబడి దోపిడీలకు పాల్పడ్డారు. వీరిపై వన్ టౌన్‌లోనూ, కంచరపాలెం క్రైం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ కేసులను సెంట్రల్ క్రైం పోలీసులకు బదిలీ చేశారు. విచారణ చేపట్టిన సిసిఎస్ పోలీసులు నిందితులిద్దరిని బుధవారం చావులమదుం వద్ద రామయ్య హోటల్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు.
సుమారు రూ. 4.50 లక్షల విలువ గల 13.48 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులను చాకచాక్యంగా అరెస్ట్ చేసిన సిసిఎస్ సిఐ జి. రఘు శ్రీనివాస్, హెచ్‌సి పి ఈశ్వరరావు, కానిస్టేబుళ్లు కుమార్, విజయ్ కుమార్, ఎం. శ్రీనివాస్, కొర్లయ్యలను క్రైం డిసిపి జె మురళీధర్ అభినందించారు.
మీడియా సమావేశంలో ఈస్ట్ ఏసిపి డిఎన్ మహేష్, వన్ టౌన్ సిఐ ఇలియాస్ అహ్మద్, మహారాణిపేట సిఐ ఆర్ మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, మరో కేసులో దారిదోపీడీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను మహారాణిపేట జోన్ క్రైం పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

దోపిడీ దొంగల అరెస్ట్
వివిధ జిల్లాల్లో పలు దొంగతనం కేసుల్లో నిందితులుగా శిక్ష అనుభవించిన ఇద్దరు యువకులను సిసిఎస్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ. 4.50 లక్షల విలువయిన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

దోపిడీ దొంగల అరెస్ట్
ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రైం డిసిపి జె. మురళీధర్ వివరాలు వెల్లడించారు.

దోపిడీ దొంగల అరెస్ట్
పిఎంపాలెంకు చెందిన దంగేటి రాజీవ్ గాంధీ, చెంగల్రావుపేటకు చెందిన వాసుపల్లి నరేంద్ర కలిసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని, కంచరపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఇళ్లల్లో చొరబడి దోపిడీలకు పాల్పడ్డారు.

దోపిడీ దొంగల అరెస్ట్
నిందితులపై వన్ టౌన్‌లోనూ, కంచరపాలెం క్రైం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ కేసులను సెంట్రల్ క్రైం పోలీసులకు బదిలీ చేశారు. విచారణ చేపట్టిన సిసిఎస్ పోలీసులు నిందితులిద్దరిని బుధవారం చావులమదుం వద్ద రామయ్య హోటల్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications