విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒక్కో ఓటరుకు 4 ఫేక్ 500నోట్లు పంచిన జగన్‌పార్టీ నేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Two YSRCP netas in custody for fake notes
విజయవాడ: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడ 21వ వార్డులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ధనలక్ష్మి డబ్బు పంచినట్టు పోలీసులు నిర్దారించారు. 2005కు ముందు ప్రింటైన 500 నోట్లను పంపిణీ చేసినట్లు పోలీసులు తెలిపారు. డబ్బు తీసుకున్నట్టు ఆరుగురు ఓటర్లు పోలీసులు విచారణలో అంగీకరించడంతో వారితో పాటు డబ్బు ఇచ్చిన ధనలక్ష్మిపై పోలీసులు ప్రజాప్రాతినిధ్యం చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసుకు సంబంధించి పోలీసులు ధనలక్ష్మితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకొని విచారించారు. కాగా, ఐదువందల రూపాయల నోటును తీసుకునేందుకు ఓ దుకాణదారు నిరాకరించిన నేపథ్యంలో ఫేక్ నోట్లు పంచుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

21వ వార్డులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఒక్క ఓటుకు రూ. రెండువేల వరకు ఇచ్చినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. పార్టీ నాయకులు ఒక్కో ఓటరుకు నాలుగు ఐదు వందల నోట్ల రూపాయలు ఇస్తున్నారట. అయితే, ఓటుకు నోటు ఇవ్వడమే కాకుండా.. దొంగనోట్లు ఇవ్వడం గమనార్హం.

పశ్చిమ గోదావరి జిల్లాలోని జగ్గారెడ్డిగూడ మండలం శ్రీనివాసపురంలో కాంగ్రెస్-వైయస్సార్ కాంగ్రెసు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఎంపిటిసి ఎన్నికల ప్రచారం సందర్భంగా రెండు వర్గాలు ఎదురుపడ్డ సమయంలో ఈ గొడవ నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.

English summary
Police took up suo moto inquiry into the allegations of distribution of fake currency notes by local YSRCP leaders during municipal elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X