రెస్టారెంట్ రుచితో ఎగ్ ఫ్రైడ్ రైస్.. సింపుల్ గా ఇలా చెయ్యండి!
రెస్టారెంట్ స్టైల్‌లో ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా సులభం. ఇలా చేసుకుని తింటే ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చెయ్యొచ్చు. దీనికి కావలసిన పదార్థాలు మరియు తయారీ విధానం ఏమిటో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
ఉడికించిన అన్నం: 2 కప్పులు (అన్నం పొడిపొడిగా ఉండాలి, చల్లారిన అన్నం అయితే ఇంకా బాగుంటుంది)
గుడ్లు (Eggs): 2 లేదా 3
ఉల్లిపాయ : 1 సన్నగా తరిగినవి
సన్నగా తరిగిన క్యారెట్, బీన్స్ ముక్కలు: అర కప్పు
పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి)
అల్లం, వెల్లుల్లి తరుగు: 1 చెంచా
మిరియాల పొడి (Black pepper powder): 1 చెంచా
సోయా సాస్: 1 చెంచా
వెనిగర్ / నిమ్మరసం: 1 చెంచా
గ్రీన్ చిల్లీ సాస్: 1 చెంచా (మీకు ఇష్టమైతే)
నూనె: 2 నుండి 3 చెంచాలు
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర లేదా ఉల్లికాడల (Spring onions) తరుగు: కొద్దిగా

తయారీ విధానం:
మొదట స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి పాన్ పెట్టుకుని, 1 చెంచా నూనె వేయండి. నూనె వేడెక్కాక గుడ్లను పగలగొట్టి వేయండి. కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లి, గుడ్డును పెద్ద పెద్ద ముక్కలుగా అయ్యేలా కలుపుతూ వేయించి, ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో మిగిలిన నూనె వేసి బాగా వేడి చేయండి ఫ్రైడ్ రైస్ ఎప్పుడూ హై ఫ్లేమ్‌లోనే చేయాలి.
ఇలా చేస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ కు టేస్ట్
నూనె కాగాక అల్లం, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసి అర నిమిషం వేయించండి. ఆ తర్వాత ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు ఎక్కువ మంటపై కలుపుతూ వేయించండి. కూరగాయలు పూర్తిగా ఉడకకూడదు, కొద్దిగా కరకరలాడుతూ ఉండాలి.ఇప్పుడు మంటను కాస్త తగ్గించి, అందులో సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి వేగంగా కలపండి.
వేడివేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ సిద్ధం
వెంటనే ఉడికించి చల్లార్చుకున్న అన్నం మరియు ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్డు ముక్కలను పాన్ లో వేయండి. దీనిపై మిరియాల పొడి చల్లండి. ఇప్పుడు మంటను మళ్లీ హై ఫ్లేమ్‌లో పెట్టి, అన్నం మెతుకులు విరిగిపోకుండా జాగ్రత్తగా 2 నిమిషాల పాటు బాగా కలుపుతూ టాస్ చేస్తూ ఫ్రై చేయండి. చివరగా ఉల్లికాడల తరుగు లేదా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేయండి.అంతే.. ఎంతో రుచికరమైన, వేడివేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ సిద్ధం.













Click it and Unblock the Notifications