ధ్వజారోహణం, ధ్వజావరోహణం లేకుండా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

కలియుగవైకుంఠంలా అలరారుతున్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇటీవలే ముగిశాయి. మొత్తం 5.76 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మొత్తం 28.94 కోట్ల రూపాయలు హుండీ ద్వారా కానుకల రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. బ్రహ్మోత్సవ రోజుల్లో మొత్తం 21.84 లక్షల అన్నప్రసాదాలను స్వీకరించారు. 2.04 లక్షల మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే.. 33 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి.

ఇప్పుడిక శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరంభం కాబోతోన్నాయి. వీటి తేదీలను టీటీడీ విడుదల చేసింది. అక్టోబర్ 12 నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో కన్యామాసం (భాద్రపదం) లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

TTD released Srivari Navaratri Brahmotsavam fete from October 12 to with Dwajarohanam Pedda Radham

ఈ బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, పెద్ద రథం, ధ్వజావరోహణాన్ని నిర్వహించట్లేదని టీటీడీ వెల్లడించింది. 12 నుంచి ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు ఉంటాయి. అక్టోబర్ 16న గరుడ వాహనసేవ సాయంత్రం 6.30 నుండి రాత్రి 11.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వైశిష్ట్యం ఇలా ఉంది.

టెంబా బావుమా, డేవిడ్ మిల్లర్ మేజిక్: ఆస్ట్రేలియాపై సెంచరీలు బాదిన హీరోలు: భారీ స్కోర్
టెంబా బావుమా, డేవిడ్ మిల్లర్ మేజిక్: ఆస్ట్రేలియాపై సెంచరీలు బాదిన హీరోలు: భారీ స్కోర్

అక్టోబరు 11- అంకురార్పణం- సాయంత్రం 7 నుండి రాత్రి 9 గంటల వరకు

12న ఉదయం 9 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం, సాయంత్రం 7 గంటలకు పెద్దశేష వాహనం

13న ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనం, సాయంత్రం 7 గంటలకు హంస వాహనం

14న ఉదయం 8 గంటలకు సింహ వాహనం, సాయంత్రం 7 గంటలకు ముత్యపుపందిరి

15న ఉదయం 8 కల్పవృక్ష వాహనం, సాయంత్రం 7 గంటలకు సర్వభూపాల వాహనం

16న ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహనం

17న ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు పుష్పక విమానం, 7 గంటలకు గజ వాహనం

18న ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, సాయంత్రం 7 గంటలకు చంద్రప్రభ వాహనం

19న ఉదయం 7 గంటలకు స్వర్ణరథం, సాయంత్రం 7 గంటలకు అశ్వ వాహనం

20న తెల్లవారు జామున 6 గంటలకు చక్రస్నానంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+