చంద్రబాబు మోడీ కంటే ఎక్కువ, బతిమాలొద్దు: హోదాపై ఉండవల్లి

Posted By:
Subscribe to Oneindia Telugu

రాజమండ్రి: ప్రత్యేక హోదా అంశంపై మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ భారతీయ జనతా పార్టీ పైన మంగళవారం నాడు నిప్పులు చెరిగారు. ఏపీని సర్వనాశనం చేయాలని బీజేపీ చూస్తోందన్నారు. నాటి ప్రధాని మన్మోహన్ ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని అంటే బీజేపీ నేత వెంకయ్య పదేళ్ల కోసం డిమాండ్ చేశారన్నారు.

ట్విస్ట్-కేవీపీదీ మనీ బిల్లా?: హోదాపై రాజ్యసభకు అధికారం లేదని జైట్లీ

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పెట్టిందన్నారు. ఇవాళ రకరకాల సాకులు చూపుతూ ప్రత్యేక హోదా ఇవ్వకుండా దాటవేస్తోందని, అది సరికాదన్నారు. పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా కోసం కేవీపీ రామచంద్ర రావు ప్రవేశపెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లుపై ఓటింగ్‌కు కేంద్రం అంగీకరించని విషయం తెలిసిందే.

దీనిపై ఉండవల్లి మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. కానీ కేంద్రాన్ని బతిమాలవద్దని చెప్పారు. తనను ఎవరూ ప్రశ్నించలేరని బీజేపీ భావిస్తోందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పినట్టే బీజేపీకీ బుద్ధి చెబుతారన్నారు.

Undavalli says BJP targetting Andhra Pradesh

వాస్తవానికి చంద్రబాబు.. ప్రధాని మోడీ కంటే ఎక్కువ అని, ఆయనకు ముఖ్యమంత్రి పదవి పెద్ద లెక్క కాదన్నారు. బాబు ధాటికి ప్రధాని మోడీ ఆగలేడన్నారు.

మోడీకి చంద్రబాబు ఝలక్: ఆ కొలికి, కేవీపీ బిల్లుపై బీజేపీ వ్యూహం

విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేయాల్సిందేనని హెచ్చరిస్తూ చంద్రబాబు సీఎం పదవి వదిలేసి, రాష్ట్రంలోనూ, దేశంలోనూ ప్రచారం చేస్తే కేంద్రం దిగిరాక ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇరవై నాలుగు గంటలూ కష్టపడుతున్నానని చంద్రబాబు చెబుతున్నారని, అది ఎవరికి కావాలని, మన హక్కులు సాధించకపోతే రాజకీయాలలో ఉంటే అర్హత కోల్పోయినట్లే అన్నారు

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former MP Undavalli Arun Kumar says BJP targetting Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి