బాలయ్య నోట.. వైఎస్సార్ మాట: బాలకృష్ణకు అర్ధరాత్రి 12 గంటలకు ఆ ఫోన్ కాల్..!!

అమరావతి: టాలీవుడ్ టాప్ హీరో, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన కేరీర్‌లోనే మొదటిసారిగా హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న టాక్ షో- అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే. గత ఏడాది బుల్లితెరపై సందడి చేసిన ఈ షోనకు కొద్దిరోజుల పాటు బ్రేక్ పడింది. మళ్లీ ఫ్రెష్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్‌స్టాపబుల్ 2 తొలి ఎపిసోడ్‌‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారా లోకేష్ సందడి చేశారు.

 గెస్ట్‌గా నల్లారి..

గెస్ట్‌గా నల్లారి..

ఇప్పుడు తాజాగా మరో మాజీ ముఖ్యమంత్రి ఈ టాక్ షోనకు గెస్ట్‌గా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి- అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే గెస్ట్‌గా కనిపించారు. ఆయనతో పాటు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ స్పీకర్ కే ఆర్ సురేష్ రెడ్డి కూడా ఇదే ఎపిసోడ్‌లో పాల్గొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం సురేష్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ లేటెస్ట్ ఎపిసోడ్ షూటింగ్ సోమవారం ప్రారంభం కానుంది.

మోహన్ బాబుతో మొదలు..

మోహన్ బాబుతో మొదలు..

గత ఏడాది ఆరంభమైన అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్బీకే తొలి ఎపిసోడ్‌లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గెస్ట్‌గా హాజరైన విషయం తెలిసిందే. ఇదివరకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన మోహన్ బాబు ఆ తరువాత పార్టీ మారారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా సినిమా-రాజకీయ నాయకులు అతిథులుగా ఈ టాక్ షో కొనసాగింది. అనంతరం అన్‌స్టాపబుల్ 2 తొలి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా చంద్రబాబు, నారా లోకేష్ హాజరయ్యారు.

 వైఎస్సార్ మాట..

వైఎస్సార్ మాట..

ఇప్పుడిక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కే ఆర్ సురేష్ రెడ్డి అతిథులుగా రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బాలకృష్ణ-నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-కేఆర్ సురేష్ రెడ్డి మధ్య సంభాషణ- ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలపై సాగింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు సైతం ప్రస్తావనకు వచ్చింది. విద్యార్థి దశ, నిజాం కాలేజీ ముచ్చట్లు, వైఎస్సార్ హయాంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, అప్పటి రాష్ట్ర స్థితిగతులపై మాట్లాడారు.

స్నేహాన్ని పరిచయం చేసిన బాలయ్య..

స్నేహాన్ని పరిచయం చేసిన బాలయ్య..

ఇన్నాళ్లు తన కుటుంబం గురించి తెలియజేసిన ప్రేక్షకులకు తన స్నేహాన్ని పరిచయం చేయాలనిపించిందంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కేఆర్ సురేష్ రెడ్డిని పరిచయం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణానంతరం తొలుత రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి ఆ బాధ్యతలను స్వీకరించారు. ఇదే విషయాన్ని బాలకృష్ణ నల్లారి దృష్టికి తీసుకెళ్లారు.

సీనియర్ మంత్రి మిస్ గైడ్..

సీనియర్ మంత్రి మిస్ గైడ్..

తాను బతికి ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి కాగలిగానని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది. కొత్త చర్చకు దారి తీసినట్టవుతోంది. ఒక సీనియర్ మంత్రి ఉండేవాడని, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తప్పు దారి పట్టించే వాడని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ హఠాన్మరణానికి దారి తీసిన హెలికాప్టర్‌ గురించి నల్లారి మాట్లాడటం ఆసక్తి రేపుతోంది. పూర్తి ఎపిసోడ్‌లో దీనికి సంబంధించిన వివరాలన్నీ వెలుగులోకి రానున్నాయి. ఈ నెల 25వ తేదీన ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది.

 గ్రేట్ పర్సనాలిటీ..

గ్రేట్ పర్సనాలిటీ..

ఈ సందర్భంగా బాలకృష్ణ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రశంసించారు. ఎంతోమంది గొప్ప నాయకులను కోల్పోయామని వ్యాఖ్యానించారు. అలాంటి వారిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరని చెప్పారు. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటోన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు గానీ అది విజయవంతం కాలేదు. 2014 ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఆ తరువాత మళ్లీ ఆయన రాజకీయాల్లో కనిపించలేదు. తెరమరుగు అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+