వర్షం: రాలిన మామిడి, మునిగిన పంట(పిక్చర్స్)
చిత్తూరు: జిల్లాలోని తిరుపతి డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో ఈదురు గాలులు, అకాల వర్షాలకు తీవ్ర పంట నష్టం జరిగింది. వర్షానికి వేరుశనగ పంట మునగగా, బలమైన ఈదురు గాలులకు మామిడి నేలరాలిపోయింది. నష్టం పరిశీలించి నివేదిక ఆధారంగా రైతులకు నష్టపరిహారం ఇస్తామని జిల్లా పాలనాధికారి సిద్ధార్థ్‌జైన్ ప్రకటించారు. ఈ క్రమంలో జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు బుధవారం తిరుపతి ఆర్డీవో వీరబ్రహ్మయ్య పలు మండలాల్లో పర్యటించారు.
ప్రధానంగా బీఎన్ కండ్రిగ మండలంలో గాజులపెళ్లూరులో గొరుపూడి గ్రామంలో సి.ఈశ్వరయ్య అనే రైతు మూడు ఎకరాలు నీటి మునిగిన వరి, వరదయ్యపాళెంలోని యానాదిమెట్ట ప్రాంతంలో దాదాపు రెండు ఎకరాల్లో దెబ్బతిన్న మామిడి, సత్యవేడు మండలంలోని శ్రీసిటీ సమీపంలోని చంగంబాకం వద్ద దెబ్బతిన్న ఇళ్లను, సత్యవేడు పరిసరాలలో నువ్వుల పంటను పరిశీలించారు.
ఉద్యాన పంటలు నష్టపోయిన రైతులను సంబంధిత శాఖ అధికారులు గుర్తిస్తారని తెలిపారు. ఆయన వెంట బీఎన్ కండ్రిగ తహసీల్దార్ జయచంద్రయ్య, వరదయ్యపాళెం ఆర్‌ఐ మురళీమోహన్, సత్యవేడు తహసీల్దార్ సత్యనారాయణనాయుడు, వ్యవసాయశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రాలిపోయిన మామిడి
జిల్లాలోని తిరుపతి డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో ఈదురు గాలులు, అకాల వర్షాలకు తీవ్ర పంట నష్టం జరిగింది.

రాలిపోయిన మామిడి
వర్షానికి వరి పంట నీట మునగగా, బలమైన ఈదురు గాలులకు మామిడి నేలరాలిపోయింది. నష్టం పరిశీలించి నివేదిక ఆధారంగా రైతులకు నష్టపరిహారం ఇస్తామని జిల్లా పాలనాధికారి సిద్ధార్థ్‌జైన్ ప్రకటించారు.

నీటమునిగిన పంట
ఈ క్రమంలో జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు బుధవారం తిరుపతి ఆర్డీవో వీరబ్రహ్మయ్య పలు మండలాల్లో పర్యటించారు.

వానకు మొలకెత్తిన వేరుశనగ
ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా పంట నష్టాన్ని అంచనావేసి ఒక్క రోజులో నివేదిక సమర్పించనున్నట్లు వెల్లడించారు.

ఆరబెట్టిన దృశ్యం
పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. వరి, వేరుసెనగ, నువ్వుల పంటలు, మామిడి తోడలు, దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు.












Click it and Unblock the Notifications