ఆయనకు పంచెలు లేవా?: వెంకయ్య 'పంచె' పంచ్, పగలబడి నవ్వారు
అమరావతి: ఛలోక్తి మాటలను విసరడంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడిది అందెవేసిన చేయి. ఆయన నోటి నుంచి మాటలు తూటాల్లా పేలుతుంటాయి. ఏపీకి ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో గురువారం వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా అద్భుతమైన పంచ్‌లను పేల్చారు. వెంకయ్యనాయుడును ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టనీయనని ఆ మధ్య ఓ మహానుభావుడు అన్నారని, పంచెలు ఊడదీస్తామన్నారని, అంత ఆసక్తి ఆయనకు ఎందుకు వచ్చిందో అర్థం కాలేదని వెంకయ్య అన్నారు. ఆయనకు పంచెలు లేవా? అని ప్రశ్నించారు.

ఆయన మాటలు తన కేమీ అర్థం కాలేదని, రాజకీయాల్లో ఉండి, వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడాలని, ఇంత అసభ్యకరంగా మాట్లాడకూడదని అన్నారు. వారికి ఓ స్థాయి ఉంది. వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు కాస్తంత ఆలోచించుకోని మాట్లాడాలని సూచించారు. అదేమంటే స్వేచ్ఛ ఉందని అంటారు.
స్వేచ్ఛ లేదని ఎవరన్నారు? అందుకే ప్రజలు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారని, శాసనసభ, పార్లమెంట్ బంధాలు లేకుండా... స్వేచ్ఛగా బయట తిరగాలని అవకాశం ఇచ్చారని కేంద్రమంత్రి వెంకయ్య ఎద్దేవా చేశారు. కాగా, ఇటీవలే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఏపీకి వెంకయ్య వస్తే పంచెలు ఊడదీయాలని అన్నారు.












Click it and Unblock the Notifications