బాత్రూంలో జారిపడ్డ కాకా, నిమ్స్‌కు సున్నం తరలింపు

ఆసుపత్రిలో సున్నం రాజయ్య
పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ నిరవధిక దీక్ష చేపట్టిన భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజులుగా ఆహారం ఏమీ తీసుకోక పోవడంతో సోమవారం ఆయన బాగా నీరసించిపోయారు.
పోలీసులు ఆదివారమే ఆయన దీక్షను భగ్నం చేశారు. సోమవారం వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. గుండెకు రక్తం సరఫరాలో ఇబ్బందులున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం రాజయ్యను భద్రాచలం నుండి హైదరాబాదులోని నిమ్స్‌కు తరలించారు.
కాగా, పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపుతు ఇటీవల కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ తెలంగాణవాదులు ఇటీవల తెలంగాణ బందుకు పిలుపునిచ్చారు. సున్నం రాజయ్య ఆర్డినెన్స్ రద్దు చేయాలని నిరాహార దీక్ష చేపట్టారు.












Click it and Unblock the Notifications