రజనీ మార్క్ రాజకీయం - కూటమిలో కలకలం..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. టీడీపీ తమకు తిరుగు లేదని భావిస్తున్న నియోజకవర్గాల్లో జగన్ వ్యూహాలు ఫలిస్తున్నాయి. జగన్ సీట్ల ఖరారులో అమలు చేసిన సామాజిక సమీకరణా లు మొత్తంగా టీడీపీకి అంతు చిక్కటం లేదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి పూర్తిగా అయోమయంగా మారింది. అక్కడ వైసీపీ నుంచి పోటీలో ఉన్న మంత్రి విడదల రజనీ పక్కా వ్యూహం తో వేస్తున్న అడుగులతో కేడర్ లో గెలుపు పైన జోష్ పెరుగుతోంది.

వ్యూహాత్మక అడుగులు

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నుంచి బీసీ వర్గానికి చెందిన విడదల రజనీని జగన్ ఎంపిక చేసారు. ప్రతిపక్షాల కంటే ముందుగానే అభ్యర్దిని ప్రకటించటంతో రజనీ ఇప్పటికే రెండు సార్లు నియోజకవర్గంలో ప్రతీ ఓటరుకు దగ్గరయ్యారు. అనేక చర్చల తరువాత టీడీపీ కోసం పని చేసిన వారిని కాదని.. టీడీపీ నుంచి కొత్త అభ్యర్థిగా గల్లా మాధవిని తీసుకురావడంపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గల్లా మాధవి ఒంటెత్తు పోకడలు పార్టీకి చేటు చేస్తున్నాయి. అంతేకాదు సీనియర్లు కూడా దూరమైపోతున్నారు. వారితో పాటు క్యాడర్ కూడా దూరంగా ఉంటోంది. మాధవి ప్రచారం పేలవంగా సాగుతోంది. రాజకీయాల్లోకి కొత్తగా ఎంట్రీ..నేతల సమన్వయం, సహకారం లేకపోవటంతో మాధవికి అంతు చిక్కటం లేదు.

Vidadala Rajini new sketch becomes big trouble for NDA alliance in Guntur West

దూకుడుగా రజనీ

అటు రజనీ దూకుడుగా ప్రచారం, ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తున్నారు. రజనీతో మాధవి పోటీ పడలేకపోతున్నారనే ప్రచారం నియోజకవర్గంలో జరుగుతోంది. రజనీ అనుభవం, స్థానికంగా పరిస్థితులు కలిసి వస్తున్నాయి. టీడీపీకి నియోజకవర్గంలో కోవెలమూడి రవీంద్ర ఇప్పటి వరకు ఇంచార్జిగా ఉన్నారు. ఆయన 2014, 2019లో కూడా టికెట్ ఆశించారు. చంద్రబాబు అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడూ ఇవ్వలేదు. దీంతో ఆయన ఆగ్రహంతో ఉన్నారు. దాదాపు క్యాడర్ అంతా ఆయనవైపే ఉంది. వారి సహకారం మాధవికి అంతంత మాత్రంగానే ఉంది. హీరో బాలక్రష్ణ వీరాభిమాని మన్నవ మోహనక్రష్ణ కూడా గుంటూరు వెస్ట్ సీటు ఆశించారు. రాకపోవడంతో బహిరంగంగానే అసంత్రప్తి వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు పిలిచి మాట్లాడారు. కానీ పని కాలేదని అంటున్నారు.

Vidadala Rajini new sketch becomes big trouble for NDA alliance in Guntur West

మాధవితో కలిసి రాని నేతలు

తాడిశెట్టి ఫ్యామిలీకి గుంటూరులో మంచి పట్టుంది. తాడిశెట్టి మురళీ మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు, సీటు రాదని గ్రహించి, చంద్రబాబు దగ్గర హామీ తీసుకుని తెలుగుదేశంలోకి వచ్చారు. తీరా వచ్చాక బాబు కూడా హ్యాండ్ ఇచ్చేసరికి మాధవికి మద్దతిచ్చే విషయంలో దూరంగానే ఉంటున్నారు. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జనసేన నేతగా ఉన్నారు. పొత్తులో భాగంగా గుంటూరు వెస్ట్ ఆశించారు. రాకపోవడంతో ఆయన సైడ్ అయిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ గా లేరు. ఉమ్మడి పొత్తులో భాగంగా బీజేపీ నుంచి ఆ పార్టీ నేత వల్లూరు జయప్రకాశ్ నారాయణ ఆశించారు. హడావుడిగా కార్యాలయం ఓపెన్ చేశారు. 18 రోజులు పాదయాత్ర చేశారు. ధూంధామ్ చేశారు. చివరికి సీటు టీడీపీకి వెళ్లిపోయింది. బీజేపీ స్టేట్ ఆఫీసుకెళ్లి ధర్నాలు చేసినా పలితం రాలేదు. అప్పటి నుంచి బుద్ధిగా ఇంటిపట్టునే ఉంటున్నారు.

ఇన్ని ప్రతికూల పరిణమాల మధ్య గల్లామాధవి గెలవడం కష్టమేనని అంటున్నారు. విడదల రజనీ చరిష్మా ముందు ఈమె నిలవలేకపోతున్నారని టీడీపీ వర్గాల్లోనే ప్రచారం సాగుతోంది. రాజకీయాల్లో తన మార్కు చూపించుకున్న విడదల రజనీపై గెలవడం ఈ పరిస్థితుల్లో అంత ఈజీకాదని అంటున్నారు. తనకే విజయావకాశాలు ఉన్నాయని విశ్లేషణలు మొదలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+