కారు బోల్తా: విజయసాయిరెడ్డికి గాయాలు, అపోలోలో చేరిక
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి మంగళవారం ఉదయం తృటిలో పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ విమానాశ్రయానికి వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ఔటర్ రింగ్ రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో విజయసాయిరెడ్డి తోపాటు పార్టీ నేతలు దుర్గా ప్రసాదరాజు, దశరత్ రెడ్డి, డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

ఈ నేతలంతా ప్రత్యేక హోదాపై ఏలూరు ధర్నాలో పాల్గొనేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications