సాయిరెడ్డి తాజా సంకేతాలు, తెర వెనుక..!?

విజయ సాయిరెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి. మాజీ ఎంపీ.. వైసీపీ లో కీలకంగా పని చేసిన సాయిరెడ్డి మరో సారి రాజకీయంగా చర్చకు కారణమయ్యారు. అమరావతి కేంద్రంగా ఆయన చేసిన ట్వీట్.. రాజ్య సభలో అమరావతి బిల్లు వేళ మహిళా ఎంపీ చేసిన వ్యాఖ్యల పై వైసీపీ ఎంపీలను నిలదీస్తూ సాయి రెడ్డి చేసిన సోషల్ మీడియా పోస్టింగ్ సంచలనంగా మారాయి. దీంతో, సాయిరెడ్డి కొత్త సంకేతాలు పై విశ్లేషణలు మొదలయ్యాయి. సాయిరెడ్డి ఈ సంకేతాల ద్వారా ఆయన అడుగులు ఎటు అనేది స్పష్టం అవుతోంది.

సాయిరెడ్డి వైసీపీని వీడారు. జగన్ కోటరీ కారణంగా చెప్పారు. ఆ తరువాత వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. లిక్కర్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు. రాజకీయంగా క్రియా శీలకంగా లేకపోయినా.. ట్వీట్ల ద్వారా తన అభిప్రాయాలను స్పష్టం చేస్తూనే ఉన్నారు. తాజాగా రాజ్యసభలో అమరావతి బిల్లు పై చర్చ ఆయన చేసిన ట్వీట్లు, స్పందించిన తీరు చూస్తుంటే.. సాయిరెడ్డి మనసు మళ్ళీ వైసీపీ వైపే మళ్లుతోందనే చర్చ వినిపిస్తోంది. రాజ్యసభలో అమరావతికి మద్దతుగా బిల్లు పాస్ కావడంపై స్పందించిన విజయసాయి రెడ్డి, అభివృద్ధిని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, అక్కడే తన మార్కు విమర్శ చేసారు. అమరావతిని అందరి రాజధానిగా అభివృద్ధి చేయాలి తప్ప, అది కేవలం ఒక వర్గానికి పరిమితమైన 'కమరావతి' గా మారకూడదంటూ ఆయన చేసిన ట్వీట్ రాజకీయ దుమారాన్ని రేపింది. రాజధాని అభివృద్ధిలో సమతుల్యత ఉండాలని సూచించారు. దీని పైన సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

vijaya-sai-reddy-latest-tweet-on-ysrcp-mps-no-response-while-allegations-against-ys-jgan-leads-to

సాయిరెడ్డి ట్వీట్లతో కొత్త సంకేతాలు.. చర్చ

కాగా.. ఆ తరువాత రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి చేసిన విమర్శలపై వైసీపీ ఎంపీలు స్పందించకపోవడం, మౌనంగా చూస్తూ ఉండిపో వడంపై విజయ్ సాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. పార్టీ అధ్యక్షుడిని ఓ ఎంపీ నోరుపారేసుకుంటే వైసీపీ ఎంపీలకు చీమకుట్టినట్టైనా లేదా? అంటూ విజయసాయిరెడ్డి నిలదీసిన తీరు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. తాజా ట్వీట్ ద్వారా జగన్ పైన తనకు ఇంకా అభిమానం తగ్గలేదని సాయి రెడ్డి చెప్పే ప్రయత్నం చేసారా అనే చర్చ మొదలైంది. అదే సమయంలో పార్లమెంటరీ పార్టీ నేత గా ఉన్న సుబ్బారెడ్డి వైఫల్యం ఎత్తి చూపే ప్రయత్నం చేసారనే వాదన వినిపిస్తోంది. రేణుకా చౌదరి మాటలు వ్ర దుమారం రేపాయి. వైసీపీ వ్యవహారాల ను నిశితంగా గమనిస్తున్న సాయిరెడ్డి.. ఇప్పటి కీ జగన్ పైన తన అభిమానం ఉందనే విధంగా సంకేతాలు ఇస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సాయి రెడ్డి తిరిగి వైసీపీలోకి వస్తారనే చర్చ పార్టీలో జరిగింది. ఇక.. రాజకీయాల పైన జూన్ తరువాత స్పందిస్తానని గతంలో సాయిరెడ్డి వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో.. సాయిరెడ్డి కూటమి లోకి వెళ్లే దారులు కనిపించటం లేదని.. తిరిగి వైసీపీలోకి రీ ఎంట్రీకి ఛాన్స్ ఉందనే చర్చ ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. దీంతో.. సాయిరెడ్డి నిర్ణయం.. భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+