చంద్రం ఎఫెక్ట్, హరికృష్ణ చనిపోతే సంబరంతో కూడిన ఆశ్చర్యమా, బాలకృష్ణా! నిజమేనా: విజయసాయి

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి ఇటీవల సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇటీవల సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా జీవో జారీ చేయడాన్ని ఉద్దేశించి సెటైర్లు వేశారు.

చంద్రం ఎఫెక్ట్

చంద్రం ఎఫెక్ట్

రెండు మూడు రోజుల్లో చంద్రబాబు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారట అని,పెద్ద నోట్లు రద్దు చేసి మోడీ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశాడని, అందుకే మా నోట్లు మేమే ముద్రించుకుంటామని ఏపీ సీఎం చెబుతారని, మేమూ మిలిటరీని ఏర్పాటు చేసుకుంటామని చెబుతారని, మా రైళ్లు, విమానాలను మేమే నడుపుకుంటామని చెబుతారని, 2050 దాకా ఎన్నికలు అవసరం లేదని జీవో తెస్తామని, అయిదేళ్లకోసారి ఎన్నికలతో అభివృద్ధి నిలిచిపోతుందని చెబుతూ ఇవన్నీ చేస్తారని విజయసాయి ఎద్దేవా చేశారు. దీనినే చంద్రం ఎఫెక్ట్ అంటారట అనిపేర్కొన్నారు.

చంద్రబాబును డాక్టర్‌కు చూపించాలి

చంద్రబాబును డాక్టర్‌కు చూపించాలి

చంద్రబాబు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని, మొన్న ఎయిర్ పోర్టులో జగన్ హత్యకు స్కెచ్ వేసి, ఆ తర్వాత అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రదేశమని చెప్పారని, ఇప్పుడు మాకేం సంబంధం అంటున్నారని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడేమో సీబీఐకి మా రాష్ట్రంతో ఏం పని అని, అడుగు పెట్టనిచ్చేది లేదని చెబుతున్నారని, ఆయనపై మానసిక రుగ్మతలు అన్నీ ఒకేసారి దాడి చేస్తున్నాయని పేర్కొన్నారు. పాపం బ్యాలెన్స్ కోల్పోయాడు.. డాక్టర్‌కు చూపించాలన్నారు.

సివిల్ సర్వెంట్స్ యస్ అనొద్దు

సివిల్ సర్వెంట్స్ యస్ అనొద్దు

'ఉన్నత స్థాయిలో ఉన్న ఏపి సివిల్ సర్వెంట్స్ కు నాదో విజ్ణప్తి. చంద్రబాబు మానసిక స్థితి బాగా లేదు. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయానికి Yes అనకండి. మరో ఆరు నెలల్లో ఎలాగూ నిష్క్రమిస్తాడు. ప్రజా వ్యతిరేక చర్యలను అడ్డుకోండి.' మరో ట్వీట్‌లో విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

ప్రచారం దొరుకుతుందంటే దేనికైనా సిద్ధమే

ప్రచారం దొరుకుతుందంటే దేనికైనా సిద్ధమే

'ప్రచారం దొరుకుతుందంటే చంద్రబాబు దేనికైనా సిద్థమే. ఇరవై లక్షల జనాభాకు మంచి నీరందించే ప్రకాశం బ్యారేజిలో శాశ్వత జల క్రీడల కేంద్రాలను ఏర్పాటు చేస్తాడట. ప్రపంచంలో ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ సోర్స్ ను జాగ్రత్తగా కాపాడుకుంటారు. బాబులాగా అపరిశుభ్రం చేయరు.' మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

Recommended Video

    Telangana Electons 2018 : సుహాసిని గో బ్యాక్ అంటూ కూకట్‌పల్లిలో నినాదాలు, కారణమిదే ! | Oneindia
    హరికృష్ణ చనిపోతే సంబరంతో కూడిన ఆశ్చర్యమే, అంతేనా?

    హరికృష్ణ చనిపోతే సంబరంతో కూడిన ఆశ్చర్యమే, అంతేనా?

    అంతకుముందు రోజు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు. కూకట్‌పల్లి నుంచి సుహాసిని నామినేషన్ సందర్భంగా బాలయ్య నోరు జారారు. దీనిని ఉద్దేశించి విజయసాయి ట్వీట్ చేశారు. 'మీ అన్న హరికృష్ణ గారు చనిపోవడం మీకు సంబరం తో కూడిన ఆశ్చర్యం కలిగించిందా? అవును, తండ్రికి వెన్నుపొడిచి కాటికి పంపిన వాడితో చేతులు కలిపిన చరిత్ర కదా. కుటుంబ సభ్యలు మరణిస్తే ఆనందం కలుగుతుందా? నిజమే మాట్లాడావా బాలయ్యా.' అని కౌంటర్ ఇచ్చారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+