బిజీ బిజీగా మంత్రులు- ట్రాక్టర్‌పై అనిత
Vijayawada floods 2024: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో నిన్నటివరకు భారీ వర్షాలు దంచికొట్టాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాలను ముంచివేశాయి. ప్రత్యేకించి- రాజధాని అమరావతి సహా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తింది. బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. సింగ్‌నగర్, చిట్టినగర్, సితార, రాజరాజేశ్వరి పేట, యనమలకుదురు, జక్కంపూడి వంటి ప్రాంతాలవాసులు వరద నీటిలో కాలం వెళ్లదీస్తోన్నారు.

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం మొత్తం విజయవాడ, గుంటూరుల్లో మకాం వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రెండు రోజులుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉంటోన్నారు. వరద తీవ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోన్నారు. అర్ధరాత్రిళ్లు కూడా ఆయన సమీక్షా సమావేశాలను నిర్వహిస్తోన్నారు. కొల్లు రవీంద్ర, పొంగూరు నారాయణ.. ఇలా దాదాపుగా మంత్రులందరూ రోడ్ల మీదే ఉంటోన్నారు.
హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సైతం వరద బాధితుల సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోన్నారు. ఈ ఉదయం ఆమె విజయవాడలో పలు ప్రాంతాల్లో ట్రాక్టర్‌పై విస్తృతంగా పర్యటించారు. కార్లు వెళ్లడానికి వీలు లేని పరిస్థితులు ఉండటం వల్ల ట్రాక్టర్‌ను ఆశ్రయించారు.

ట్రాక్టర్‌పై కాలనీల్లో కలియతిరిగారు. ప్రతి ఇంటికీ వెళ్లారు. అక్కడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారికి ఆహారం, మంచినీళ్లు, నిత్యావసర పాకెట్లను అందించారు. అనంతరం ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో సహా భారీ వర్షాలపై విపత్తుల నిర్వహణ విభాగం కార్యాలయంలో సమీక్షలను నిర్వహించారు.












Click it and Unblock the Notifications