సిల్వర్‌స్పూన్ హోటల్ చికెన్ బిర్యానీలో బల్లి: ఇద్దరు ఆస్పత్రిపాలు
విజయవాడ: నగరంలోని టీచర్స్ కాలనీలోని సిల్వర్‌స్పూన్ హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఇద్దరు కస్టమర్లు ఆస్పత్రిపాలయ్యారు. శుక్రవారం ఈ హోటల్లో బల్లి పడిన చికెన్ బిర్యానీ తిని ఇద్దరు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు.
బిర్యానీ తిన్న వారు వాంతులు చేసుకోవడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై వినియోగదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు బల్లిపడిన చికెన్ బిర్యానీని స్వాధీనం చేసుకున్నారు. తాత్కాలికంగా సదరు హోటల్‌ను సీజ్ చేశారు.

అమరావతి ప్రాంతం రాజధాని కావడంతో ఇక్కడ అనేక హోటళ్లు వెలుస్తున్నాయి. కష్టమర్లు కూడా భారీగా ఉంటున్నారు. అయితే, హోటళ్ల యాజమాన్యం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కష్టమర్ల ఆరోగ్యంతో చెలగాటాలాడుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని కోరుతున్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications