విజయవాడ జనసేనకు ఖరారు, మేయర్ అభ్యర్దిగా - అనూహ్య ఎంపిక..!?

ఏపీలో స్థానిక ఎన్నికల సమరం మొదలైంది. ఈ నెల 14న ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. కూటమి పొత్తుల లెక్కల్లో భాగంగా అనూహ్యంగా విజయవాడ మేయర్ స్థానం జనసేనకు దక్కటం దాదాపు ఖాయమైంది. దీంతో... విజయవాడ మేయర్ అభ్యర్దిగా పవన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలి నుంచి విజయవాడ పైన ఫోకస్ చేసిన పవన్.. ఇప్పుడు అభ్యర్ధి విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్నారు.

విజయవాడ మేయర్ సీటు జనసేనకు దాదాపు ఖాయమైంది. పొత్తుల లెక్కల్లో భాగంగా తొలి నుంచి విజయవాడ పైన జనసేన పట్టు బడుతోంది. టీడీపీ తమ కంచుకోటగా భావించే విజయవాడ సీటు జనసేనకు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. పవన్ వ్యూహాత్మకంగానే తొలి నుంచి ఈ సీటు కోరుతూ వస్తున్నారు. విజయవాడ కేంద్రంగా జనసేన నిర్వహించిన సమావేశంలోనూ ఇదే సంకేతాలు ఇచ్చారు. ఈ సాయంత్రం చంద్రబాబు, పవన్ మధ్య జరిగే చర్చల్లో ఈ సీటు పైన తుది నిర్ణయం వెల్లడి కానుంది. కాగా.. విజయవాడ మేయర్ సీటు బరిలో వంగవీటి రాధా పేరు కొంత కాలంగా ప్రచారంలో ఉంది. అయితే, రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం రాధా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అందులో భాగంగా రాధా టీడీపీలో కొనసాగుతున్న వేళ.. ఆయన సతీమణికి మేయర్ సీటు పైన ప్రచారం సాగుతోంది.

 జనసేన -బీజేపికి దక్కే మేయర్, మున్సిపల్ సీట్లు ఫైనల్: ఎవరికి ఎక్కడ..!!
జనసేన -బీజేపికి దక్కే మేయర్, మున్సిపల్ సీట్లు ఫైనల్: ఎవరికి ఎక్కడ..!!
vijayawada-mayor-jana-sena-considering-vangaveeti-pushpanjali-s-name-here-the-details

చంద్రబాబు- పవన్ భేటీలో తుది నిర్ణయం

విజయవాడ మేయర్ పదవికి జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ సతీమణి వంగవీటి పుష్పాంజలి పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ నేతల సమాచారం. రిజర్వేషన్లలో భాగంగా విజయవాడ మేయర్ సీటు జనరల్ గా ఉంది. మేయర్ సీట్లలో 50 శాతం మహిళలకు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా జనసేన నుంచి పుష్పాంజలికి సీటు కేటాయిస్తారని తెలుస్తోంది. అదే విధంగా అమ్మశెట్టి వాసు, సుబ్బారాయుడు, సంతోష్ కృష్ణ పేర్లు కూడా చర్చల్లో ఉన్నాయి. కాగా... ఈ సీటు కోసం టీడీపీ నుంచి పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఇప్పుడు జనసేనకు మేయర్ సీటు దక్కటంతో టీడీపీ నుంచి బీసీ నేతకు డిప్యూటీ మేయర్ ఇస్తారని సమాచారం. ఈ సాయంత్రం చంద్రబాబు, పవన్, మాధవ్ మధ్య జరిగే చర్చల్లో సీట్లు.. అభ్యర్ధుల పైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+