Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేశినేని- కొలికపూడి పోరులో భారీ ట్విస్ట్..! తేల్చేసిన కూటమి ?

ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టాయి. ముఖ్యంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో మొదలైన ఈ వివాదంలో జోక్యం చేసుకునేందుకు అధిష్టానం సైతం నిరాకరించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కేశినేని చిన్ని ఎత్తుకు పైఎత్తులు వేశారు. దీంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది.

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తనపై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆత్మరక్షణలో పడినట్లు కనిపించిన ఎంపీ కేశినేని చిన్ని.. తాజాగా రూటు మార్చారు. అధిష్టానం ఈ వివాదంలో జోక్యానికి నిరాకరించడంతో ఉమ్మడి జిల్లాలో తన బలం చాటుకునేందుకు
సిద్దమయ్యారు. ఇందులో భాగంగా ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధుల, నాయకుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేయించారు. దీంతో విజయవాడలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధుల, నాయకుల సమావేశం జరిగింది.

vijayawada mp kesineni chinni unites nda against rival mla kolikapudi Srinivas

ఈ సమావేశానికి ఉమ్మడి కృష్ణాజిల్లా కూటమి నేతలు ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా పార్టీ అధ్యక్షుడు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురామ్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ,ఎమ్మెల్యే లు బోడే ప్రసాద్,యార్లగడ్డ వెంకట్రావు, వర్ల కుమార్ రాజ, వసంత కృష్ణ ప్రసాద్, బోండా ఉమా మహేశ్వరరావు, శ్రీరాం రాజ గోపాల్(తాతయ్య), కాగిత కృష్ణ ప్రసాద్, మండలి బుద్ధ ప్రసాద్, బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, అడ్డూరి శ్రీరామ్, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయ భానులతో పాటు తదితరులు హాజరయ్యారు.

vijayawada mp kesineni chinni unites nda against rival mla kolikapudi Srinivas

పైకి కూటమి సమన్వయ భేటీగా చెబుతున్నా ఈ సమావేశం ఉద్దేశం కేశినేని చిన్నికి కూటమి అండగా ఉందన్న సంకేతాలు ఇవ్వడమే. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తో విభేదాల నేపథ్యంలో కూటమి అండ కేశినేనికే ఉందనే సంకేతాల్ని ఈ భేటీ ఇచ్చింది. దీంతో ఈ సమావేశం కేశినేని చిన్నికి ఊరటనివ్వగా.. కొలికపూడికి షాక్ ఇచ్చినట్లయింది. ఇప్పటికే టీడీపీ అధిష్టానం కొలికపూడి విషయంలో ఆగ్రహంగా ఉందన్న ప్రచారం నేపథ్యంలో.. ఈ భేటీలో కూటమి నేతలు కూడా కేశినేనికే అండగా నిలవాలని నిర్ణయించుకోవడం కీలకంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+