విశాఖపై బీజేపీ కన్ను, చంద్రబాబు ఛాయిస్ ఎవరు - కలిసొచ్చేదెవరికి..!!

విశాఖ పార్లమెంట్ స్థానం పార్టీలకు హాట్ సీటుగా మారింది. విశాఖ ఎంపీ స్థానం గెలుపు పార్టీలకుకూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే వైసీపీ ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్దిగా బొత్స ఝాన్సీ ఖరారయ్యారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి పోటీ నెలకొంది. బీజేపీ విశాఖ తమకు కేటాయించాలని కోరుతోంది. బీజేపీ నుంచి ఇద్దరు ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. టీడీపీ మాత్రం విశాఖ ఇచ్చేందుకు ససేమిరా అంటోంది. మరి, చంద్రబాబు నిర్ణయం ఏంటి.

పొత్తుల లెక్కలు
ఏపీలో పొత్తులపై క్లారిటీ వచ్చింది. టీడీపీ కూటమిలో ఎవరికి ఎన్ని సీట్లనేది స్పష్టత వచ్చింది. ఏ పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేస్తుందనే అంశం పై చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ కి ఆరు ఎంపీ స్థానాలు దక్కాయి. బీజేపీ విశాఖ స్థానం ఇవ్వాలని గట్టిగా కోరుతోంది. టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీకి ప్రతిపాదించిన స్థానాల్లో విశాఖ లేదు.

Visakhapatnam Lok Sabha constituency is likely to witness a multi-cornered contest in up coming Elections

అయితే, బీజేపీ నేతలు జీవీఎల్ నరసింహారావు రెండేళ్ల కాలంగా విశాఖలో పర్యటనలు చేస్తున్నారు. తనకు విశాఖ సీటు వస్తుందని ఆశిస్తున్నారు. తాజాగా స్థానికంగా ఉండే పలు సంఘాలు జీవీఎల్ కు సీటు ఇవ్వాలంటూ బీజేపీ నాయకత్వానికి లేఖలు రాస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సైతం విశాఖ సీటు తనకు ఇవ్వాలంటూ బీజేపీ చీఫ్ నడ్డాకు లేఖ రాసారు.

ఛాన్స్ దక్కేదెవరికి
విశాఖ పార్లమెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిని ప్రకటిస్తే.. గీతం విద్యాసంస్థల అధినేత శ్రీభరత్ రంగంలోకి దిగాలని ఎప్పటినుంచో సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు ప్రజాశాంతి పార్టీ లీడర్ కేఏ పాల్ కూడా విశాఖ పార్లమెంట్ స్థానంపై కన్నేశారు. ఇటీవలే కొత్త పార్టీ ప్రారంభించిన జేడీ లక్ష్మీనారాయణ కూడా జై భారత్ పార్టీ తరపున విశాఖ ఎంపీగా పోటీచేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి సబ్బిరామిరెడ్డి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. విజయనగరంకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి విశాఖ ఎంపీ బరిలోకి దిగుతున్నారు. గతంలో బొబ్బిలి ఎంపీగా బొత్స ఝాన్సీ ఎన్నికయ్యారు. అయితే, ఈసారి విశాఖలో ఆమె అడుగు పెడుతున్నారు.

Visakhapatnam Lok Sabha constituency is likely to witness a multi-cornered contest in up coming Elections

హోరా హోరీ
బొత్స సత్యనారాయణకుకూడా విశాఖలో పెద్ద ఎత్తున వ్యాపారాలు ఉన్నాయి. వైసీపీకి కూడా విశాఖ ఎంపీ స్థానం కీలకం కావడంతో అనూహ్యంగా స్థానికురాలైన బీసీ మహిళలను ప్రకటించింది. ఇక్కడ కూటమి నుంచి అభ్యర్ది విషయంలో చంద్రబాబు నిర్ణయం కీలకం కానుంది. విశాఖ కోరుతున్న బీజేపీకి అనకాపల్లి ఇస్తారని చెబుతున్నారు.

అయితే, బీజేపీ అధినాయకత్వం నుంచి విశాఖ సీటు కోసం ఒత్తిడి కొనసాగు తోంది. బీజేపీకి విశాఖ ఇవ్వాల్సి వస్తే టీడీపీ అనకాపల్లి తీసుకొనే ఛాన్స్ ఉంది. దీంతో, పలువురు ముఖ్య నేతలు విశాఖ నుంచి బరిలోకి దిగనుండటంతో బహుముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో, అసలు సాగరతీరంలో ప్రజలు ఎవరికి పట్టం కడతారు..ఈ పోరులో ఓట్ల చీలక ఎవరికి కలిసి వస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+