విశాఖ లోక్‌సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో విశాఖకు ప్రత్యేక గుర్తింపుంది. ఈ పార్లమెంట్ పరిధిలో అనేక ఇతర రాష్ట్రాల వారు వచ్చి స్థిరపడ్డారు.ఇటు తెలుగువారితో పాటు అటు ఉత్తరాదికి చెందిన వారు కూడా ఎక్కువగానే నివసిస్తూ ఉంటారు. వీరంతా ఉద్యోగరీత్యా ఇక్కడకు వచ్చి సెటిల్ అయిన వారు. ఇక స్థానికంగా నివసిస్తున్న తెలుగు ప్రజలు వివిధ సామాజిక వర్గాలకు చెందినవారున్నారు. ముఖ్యంగా విశాఖ పరిధిలో ఎన్ని బలమైన సామాజిక వర్గాలున్నా అక్కడ కమ్మ సామాజిక వర్గంకు చెందిన వారి మాటే చెల్లుతుందనే టాక్ ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వారిదే అక్కడ పెత్తనం ఎక్కువగా ఉంటుందనే విమర్శలున్నాయి. ఓట్ల పరంగా, సంఖ్యా పరంగా కూడా ఎక్కువగా లేని కమ్మ సామాజికవర్గం వారు చంద్రబాబు అధికారంలో ఉండగా అతని అండ చూసుకుని ఆ సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు కోట్లకు పడగలెత్తారనే విమర్శలు ఇక్కడ బలంగా వినిపిస్తున్నాయి.

విశాఖ గడ్డపైనే పుట్టి, విశాఖ గాలినే పీల్చి ఇక్కడే పెరిగి ఈ మట్టినే నమ్ముకుని కొన్ని తరాలుగా జీవిస్తున్నామని, ఎక్కడి నుంచో వచ్చిన ఆ సామాజికవర్గం వారు కమ్మ అనే బ్రాండ్ పేరు సృష్టించుకుని యూనివర్శిటీలు, ప్రభుత్వ భూములు కబ్జా చేశారని స్థానిక విశాఖ వాసులు ఆరోపిస్తున్నారు. ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకులు సొంతంగా వారు ఎదిగారే తప్పితే ఇక్కడి ప్రజలకు ఏం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Visakhapatnam people unhappy with one caste domination How will Botsa Jhansi get along

ఉత్తరాంధ్రలో బీసీలు, కాపులు, తూర్పు కాపులు, ఎస్సీలు ఎక్కువ. వీరందరినీ కాదని, కమ్మ వాళ్లు ఎక్కడ నుంచి వచ్చారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ లోక్ సభ పరిధిలో తూర్పు కాపు సామాజికవర్గం ఓట్లు 2.30 లక్షలు ఉన్నాయి. మరోవైపు నుంచి కాపుఓట్లను తమ వైపునకు తిప్పుకోవడానికి చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

విశాఖలో కాపుల ఓట్ల బలం ఏడాదికేడాది పెరుగుతూ పోతోంది. కాపుల్లో అవగాహన ఆలోచన శక్తి పెరుగుతోంది. కొన్ని దశాబ్దాలుగా కొండలు కోనల మధ్య బతుకుతుంటే ఎక్కడి నుంచో వచ్చిన కమ్మసామాజిక వర్గంవారి పెత్తనం ఏంటని బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు.ఇక సోషల్ మీడియా వేదికగా వారి ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉత్తరాంధ్ర జోలికి వస్తే, ఉతికి ఆరబెడతామంటూ స్ట్రాంగ్ వార్నింగ్‌లు సైతం ఇస్తున్నారు...ఎక్కడ నుంచి వచ్చారో అక్కడికే పొండి అంటూ టీడీపీ నేతలపై సోషల్ మీడియాలో విశాఖ స్థానిక నెటిజెన్లు విరుచుకు పడుతున్నారు.

ఇదంతా ఇలా ఉంటే ఎక్కువ సంఖ్యలో ఇతర సామాజిక వర్గాలు ఉంటే.. ప్రజలు ఏం మాట్లాడాలో కమ్మ సామాజిక వర్గంకు చెందిన నేతలు డిసైడ్ చేయడాన్ని ఇతరులు జీర్ణించుకోలేకున్నారు. మా ఉత్తరాంధ్ర గురించి మాట్లాడేందుకు మీరెవరంటూ నేరుగా నేతలను ప్రశ్నిస్తున్న తీరు కనిపిస్తోంది.మొన్నటికి మొన్న గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నుంచి పోటీ చేయాల్సిందిగా టీడీపీ అధిష్టానం ఆదేశించిందనే వార్తలు షికారు చేశాయి.అయితే విశాఖ లోక్ సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కాపు అభ్యర్థులు లేకపోయేసరికి, గంటాను తిరిగి తీసుకొచ్చి భీమిలీలో అభ్యర్థిగా పెట్టారు. కాపులకి భయపడే చంద్రబాబు ఇంతా చేశాడనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.మొత్తానికి ఉత్తరాంధ్రలో కాపుల ఉనికికే చంద్రబాబు ప్రమాదం తీసుకొచ్చేలా ఉన్నాడనే భయాందోళనలు జనాల్లో ఎక్కువ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహనరెడ్డి విశాఖ ఎంపీ బరిలోకి ఉన్నత విద్యావంతురాలు, సీనియర్ పార్లమెంటేరియన్ బొత్సా ఝాన్సీ లక్ష్మీకి సీటు ఇచ్చారు. దీంతో వార్ వన్ సైడ్ అయ్యిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.కాపు, తూర్పు కాపు, బీసీ, ఎస్సీ సామాజికవర్గాలన్నీ ఒక తాటిపైకి వచ్చి బొత్స ఝాన్సీకి అండగా ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలానే కొనసాగితే బొత్స ఝాన్సీ గెలుపు సులభమనే చర్చ విశాఖ పార్లమెంట్ పరిధిలో జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+