విశాఖ- సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులకు గుడ్ న్యూస్

Vande Bharat Express: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 51 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.

సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు, వేగం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.

Visakhapatnam-Secunderabad Vande Bharat Express schedule has been revised from today

విశాఖపట్నం- సికింద్రాబాద్‌ మధ్య నడిచే నంబర్ 20833 నంబర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రీషెడ్యూల్ అయింది. మంగళవారం ఈ రైలు సర్వీస్ ఇకపై అందుబాటులో ఉండదు. ఆ రోజున ఈ రైలు సర్వీస్ రద్దయింది. మంగళవారానికి బదులుగా ఆదివారం ఈ సర్వీస్ అందుబాటులో ఉండబోతోంది.

వారంలో ఆరు రోజుల పాటు నడిచే ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ఇది. నిన్నటివరకు కూడా సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ రాకపోకలు సాగించేది. ఆదివారం ఈ సర్వీస్ అందుబాటులో ఉండేది కాదు. ఆదివారం సెలవురోజు కావడం వల్ల విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లి రావాలనుకునే వారికి ఇబ్బందులు ఎదురయ్యేది.

దీన్ని మార్చాలంటూ ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు ఈ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులో మార్పులు చేశారు. ఇకపై ఆదివారానికి బదులుగా మంగళవారం నాడు ఈ రైలు సర్వీస్ అందుబాటులో ఉండబోదని తెలిపారు.

అంటే ఈ ఆదివారం అంటే ఆగస్టు 11వ తేదీన విశాఖపట్నం- సికింద్రాబాద్- విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణకుల కోసం అందుబాటులో ఉండబోతోంది. మంగళారం నాడు రద్దవుతుంది. ఈ మేరకు వాల్తేర్ డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ కే సందీప్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+