కిడ్నీ రాకెట్‌తో విశాఖకు లింకు: ఆస్పత్రి డైరెక్టర్ అరెస్ట్
విశాఖపట్నం: సంచలనం సృష్టించిన ఒడిశా కిడ్నీ రాకెట్‌కు విశాఖపట్నంతో ఉన్న లింకులను పోలీసులు ఛేదించారు. విశాఖపట్నంలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి డైరెక్టర్‌గా కొనసాగుతున్న ప్రభాకర్ అనే వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఇతడే కిడ్నీ రాకెట్ సూత్రధారి అని పోలీసులు నిర్ధారించారు. కిడ్నీ రాకెట్‌కు సంబంధించిన కేసు ఒడిశాలోని కటక్‌లో నమోదైంది.
ఈ నేపథ్యంలో ప్రభాకర్‌ను ఒడిశాకు తరలించేందుకు ఆ రాష్ట్ర పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాకర్ నాయకత్వంలోని కిడ్నీ రాకెట్ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయనకు కొంత అనారోగ్యంగా ఉండటంతో విశాఖలోని కెజిహెచ్‌లో వైద్యం అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందనే వైద్యులు తెలపడంతో ఒడిశా తరలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

అపార్ట్‌మెంట్‌లో గొడవ: పిస్తోలుతో దాడి
విశాఖపట్నంలో సోమవారం అర్ధరాత్రి ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన గొడవ కలకలం రేపింది. సీతమ్మధారలోని శ్రీవర్షిణి అపార్ట్‌మెంట్‌లో కారు పార్కింగ్ విషయంలో ఫ్లాట్ ఓనర్లలో ఒకరైన బిల్డర్ వెంకటపతిరాజు, మరో ఫ్లాట్ ఓనర్ షేక్ భాషాకు మధ్య ఘర్షణ జరిగింది.
వెంకటపతిరాజు పిస్తోలుతో తీవ్రంగా కొట్టారని షేక్ భాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘర్షణలో భాషా బావమరిది అబ్దుల్ సత్తార్‌కు తీవ్ర గాయాలవడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. భాషా కుటుంబసభ్యులు తమపై దాడి చేశారని వెంకటపతి రాజు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications