ఏపీలో రైలు ప్రయాణికులకు కీలక సూచన చేసిన కేంద్రం

రైళ్లకు జనరల్ బోగీలు ఉండటమే తక్కువ అవుతోంది. ఇంజన్ తర్వాత ఒక బోగీ ఉంటే.. రైలు చివరలో గార్డు బోగీకి ముందు ఒక జనర్ బోగీ ఉంటుంది. ఈ రెండు బోగీల్లోనే ఎంత దూరమైనా కిక్కిరిసి ప్రయాణించాల్సి ఉంటుంది. అంతకుమించి అదనపు బోగీలను మాత్రం రైల్వే ఏర్పాటు చేయదు. దీంతో చాలామంది ప్రయాణికులు మహిళల బోగీలోకి, దివ్యాంగులకు కేటాయించిన బోగీలోకి ఎక్కుతారు. అయితే ఇకనుంచి ఏపీలో మాత్రం ఇది చెల్లదు. ఈ రెండు బోగీల్లోకి ఎక్కిన ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకునేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిద్ధమైంది.

విశాఖపట్నం స్టేషన్ లో తనిఖీలు
ఇందులో భాగంగా ముందుగా విశాఖపట్నంలోని రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా మహిళలు, దివ్యాంగుల బోగీల్లోకి ఎక్కిన 100 మందిని అదుపులోకి తీసుకొని ఆర్పీఎఫ్ స్టేషన్ కు తరలించారు. విధి లేని పరిస్థితుల్లోనే అలా చేయాల్సి వచ్చిందని వారంతా అధికారులకు చెప్పారు. అవసరమైతే ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని, అంతేకానీ మహిళలకు, దివ్యాంగులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రయాణించొద్దని ఆర్పీఎఫ్ అధికారులు వారికి సూచించారు.
లేకపోతే మరో రోజుకు ప్రయాణం వాయిదా వేసుకోవాలని, దివ్యాంగులు, మహిళలకు ఇబ్బంది కలిగించేలా ప్రయాణాలు చేయొద్దని సూచిస్తున్నారు..

Vizag RPF police arrested illegal passengers in PHC and women bogies

స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు
అదుపులోకి తీసుకున్నవారిపై కేసులు నమోదుచేసి స్టేషన్ బెయిల్ పై పంపించారు. వీరిని అదుపులోకి తీసుకోవడంతో వీరు ఎక్కాల్సిన రైలుతోపాటు ఇతర రైళ్లు కూడా వెళ్లిపోవడంతో అందరూ మళ్లీ రైళ్ల కోసం స్టేషన్ పై ఎదురుచూస్తూ నిలబడ్డారు. వీరిలో ఎక్కవమంది ఏపీతోపాటు ఒడిసా, చత్తీస్ గఢ్, జార్కండ్ రాష్ట్రాలకు చెందినవారున్నారు. మూడునెలల ముందుగా రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ దొరకడంలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో జనరల్ బోగీల్లో ప్రయాణం చేయాల్సి వస్తోందని వారంతా వాపోయారు. దిక్కుతోచని పరిస్థితుల్లో అలా ప్రయాణించాల్సి వస్తోందన్నారు. దూర ప్రాంతాలకు తిరిగే రైళ్లల్లో జనరల్ బోగీల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+