ఈ రూపాయి షేర్ల కోసం ఎగబడుతున్న జనం
ఇండియన్ బెంచ్ మార్క్ సూచీలు ప్రారంభంలో కాస్తంత తడబడినప్పటికీ మళ్లీ పుంజుకొని పరుగులు తీస్తున్నాయి. బీఎస్ఈ రియాల్టీ ఇండెక్స్ నష్టాల్లోకి జారుకోవడంతో ఆరంభంలో స్తబ్దుగా సాగాయి. తాజాగా మాత్రం లాభాల్లోకి వచ్చాయి. బొంబాయి స్టాక్స్ ఇండెక్స్ సెన్సెక్స్ సూచీ 123 పాయింట్లు లాభపడింది. 66 వేల 227 మార్క్ వద్ద కొనసాగుతోంది. నేషనల్ స్టాక్స్ ఇండెక్స్ నిఫ్టీ 50 సూచీ 60 పాయింట్లు వృద్ధి చెందింది. 19 వేల 625 మార్క్ వద్ద ట్రేడవుతోంది.
బీఎస్ఈ సెన్సెక్స్‌లో 2,151 షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 1,278 షేర్లు నష్టాల్లోకి వెళ్లాయి. అయితే 186 స్టాక్స్ లో మాత్రం ఎటువంటి మార్పు లేదు.
విప్రో లిమిటెడ్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ వంటివి లాభాల్లో ఉండగా, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, టైటాన్ ఇండియా వంటి కీలక రంగాల షేర్లు నష్టాల్లోకి పయనించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.51 శాతం లాభపడింది. . బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.08 శాతం పెరిగింది. టాప్ మిడ్ క్యాప్ స్టాక్ గా వొడాఫోన్ ఐడియా నిలిచింది.

ఈ తరహా సానుకూల పరిస్థితుల్లో కొన్ని పెన్నీ స్టాక్స్ జోరుమీదున్నాయి. ఈరోజు ట్రేడింగ్ లో రూపాయి షేర్ల కోసం పెట్టుబడిదారులు ఎగబడడంతో అన్నీ అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి. పెట్టుబడిదారులకు మంచి లాభాలు అందిస్తున్నాయి. ఈ పెన్నీ స్టాక్స్‌ను తమ వాచ్ లిస్ట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.వాటి వివరాలు.. USG Tech Solutions Ltd, Gayatri Projects Ltd, Royal India Corporation Ltd, Gopal Iron And Steels Company Gujarat Ltd, Epsom Properties












Click it and Unblock the Notifications