ఇవాళే ఫోన్ చేశా మాఫీ చేస్తా, తెరాస అడ్డుకుంటే: బాబు

హైదరాబాద్: రైతుల రుణాలు మాఫీ చేసి తీరుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోటలో ఆయన రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను ఆర్బీఐతో ఇవాళే మాట్లాడానని చెప్పారు. త్వరలో దీని పైన పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు.

స్పష్టత రాగానే ప్రస్తుతానికి ఒక ఇంటికి ఒక రుణం మాఫీ అయ్యేలా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. జూన్ 1వ తేదీ నుండి రాజధాని ఖాతాలో పన్నులు జమ అవుతున్నాయని చంద్రబాబు చెప్పారు. రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతామని చెప్పారు.

We committed to loan waiver: Chandrababu

అంతకుముందు ద్వారకా తిరుమలలో స్వామివారిని చంద్రబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ద్వారకా తిరుమలలో పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. పోలవరం బిల్లును తెలంగాణ రాష్ట్ర సమితి అడ్డుకుంటే బీజేపీ, టీడీపీలు సాధించాయని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోను ఆలయాల ఆదాయాన్ని విద్య, వైద్య సంస్థలకు వినియోగిస్తామన్నారు. 13 ప్రధాన ఆలయాలలో ఉచిత భోజన వసతి ఉంటుందన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుండి వృద్ధులకు వెయ్యి రూపాయల పింఛన్ ఇస్తామన్నారు. తనకే కార్యాలయం లేదని చంద్రబాబు అన్నారు. పంట రావాలంటే ఆరు నెలలు పడుతుందని, తన పరిస్థితి కూడా అంతే అన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని, అభివృద్ధితో ఆదాయం పెంచుదామన్నారు. బెల్టు షాపుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+