ఏపీకి ప్రమాద హెచ్చరిక

రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర కోస్తాలో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాబోయే మూడు రోజుల్లో కృష్ణా, గుంటూరు, పార్వతీపురం, శ్రీకాకుళం, అల్లూరి, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి ఈదురు గాలులు బలంగా వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

weather update

తెలంగాణకు కూడా వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కరీంగర్, కామారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

జులై నెలలో కురిసిన వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. వాగులు వంకలు పొర్లాయి. ప్రాజెక్టులన్నీ నీటికుండల్లా మారాయి. కానీ అంతలోనే ఆగస్టు నెల రావడం.. మూడువారాలు పూర్తవుతున్నా చినుకు జాడే లేకుండా పోయింది. తాజాగా అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+