కార్తీక పూర్ణిమ 26నా, 27వ తేదీనా - శుభసమయం, కోర్కెలు తీరాలంటే..!!

ఎందుకంటే కార్తీక మాసం శివ కేశువులను పూజించడానికి ఉత్తమైన మాసంగా పరిగణించబడుతుంది. ఈ రోజున నదిలో చేసే స్నానం, దీపారాధన, దానం అత్యంత విశిష్టమని.. యాగం చేసిన ఫలితం లభిస్తుందని ఆ రోజున నదీ స్నానాలు చేసి.. దానం చేస్తే.. కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. మరి, ఈ ఏడాది కార్తిక పూర్ణిమ ఏరోజున వచ్చింది. ప్రాముఖ్యత ఏంటి.

రెండు రోజుల్లో ఎప్పుడు:ఏడాది అధిక మాసం కారణంగా.. పండగ తిథులన్నీ రెండు రోజూల్లో విస్తరించి ఉంటున్న సంగతి తెలిసిందే. ఇదే విధంగా కార్తిక పౌర్ణమి కూడా రెండు రోజుల్లో వచ్చింది. నవంబర్ 26, 27 తేదీల్లో ఈ పౌర్ణమి ఘడియలు ఉన్నాయి. దీంతో.. అత్యంత పవిత్రమైన కార్తిక పౌర్ణమి పండుగను ఏ రోజున నిర్వహించుకోవాలనే చర్చ సాగుతోంది. వ-విష్ణువులిద్దరికీ ఎంతో ఇష్టమైన ఈ కార్తిక పౌర్ణమిని.. శరత్‌ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. కార్తికేయుడు జన్మించిన కృత్తిక నక్షత్రంలోనే కార్తిక పౌర్ణమి పర్వదినం వస్తుంది. ఇంతటి పవిత్రమైన కార్తిక పౌర్ణమి రోజున భక్తులు ఉదయాన్నే పవిత్ర నదిలో స్నానం చేసి.. దాన, ధర్మాలు చేస్తారు. ఈ విధంగా చేస్తే ఈ మాసం మొత్తం భగవంతున్ని పూజించినంత ఫలితం లభిస్తుందని విశ్వసిస్తారు.

When in Kartik Purnima: Date, Puja Timings and significance, details here

దీపం..ఉపవాసం:దృక్ పంచాంగం ప్రకారం పౌర్ణమి తిథి నవంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 3గంటల 53 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే.. నవంబర్ 27న సాయంత్రం 02:45 గంటలకు ముగుస్తుంది. అయితే.. కార్తిక పౌర్ణమి అంటే ఆ రోజున చేయాల్సిన అతిముఖ్యమైన పని దీపం వెలిగించడం. దీపం వెలిగించడం ద్వారా.. జీవితంలోకి కొత్త కాంతిని ఆహ్వానిస్తారు. ఈ పని రాత్రివేళవేళ మాత్రమే చేస్తారు. దీపం వెలిగిస్తున్నప్పుడు పౌర్ణమి ఘడియలతోపాటు కృత్తిక నక్షత్రం ఉండాలి. ఇలా చూసుకున్నప్పుడు 26వ తేదీన మాత్రమే ఈ ఘడియలు ఉన్నాయి. అందువల్ల ఆ రోజునే(ఆదివారం) జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో..ఉదయ తిథి ప్రకారం, 27 నవంబర్ 2023 సోమవారం నాడు పూర్ణిమ ఉపవాసం, స్నానం ఆచరిస్తారు.

కార్తీక అభిషేకం:ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం చేయండి లేదా గంగాజలం కలిపిన నీటితో ఇంట్లో స్నానం చేయవచ్చు. అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున భక్తులు శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ఆయన అనుగ్రహం కోసం దేవాలయాలను సందర్శించి, దీపాలు వెలిగిస్తారు. ఇలా.. కార్తిక దీపాలను వెలిగించి పూజ చేయడం వల్ల.. వెయ్యి యుగాలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఇదే సమయంలో.. అభిషేక ప్రియుడైన శివునికి పాలు, తేనెతో అభిషేకం చేస్తారు. దీనినే రుద్రాభిషేకం అంటారు. రాత్రి చంద్రోదయం తర్వాత పచ్చి పాలను నీటిలో కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. విష్ణువును పూజించిన తర్వాత చలిమిడి, వడపప్పు సహా పంచామృతాన్ని ప్రసాదంగా సమర్పించి ఉపవాసం విరమించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+